Mohammad Azharuddin: వాళ్ల అవినీతి బయటికొస్తుందనే నాపై ఆరోపణలు: హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌

గత కొంత కాలంగా అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులకు, అజారుద్దీన్‌కు మధ్య తీవ్ర విభేదాలు నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇరు వర్గాలు పరస్పర ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి.

Mohammad Azharuddin: వాళ్ల అవినీతి బయటికొస్తుందనే నాపై ఆరోపణలు: హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌
Mohammed Azharuddin
Follow us
Venkata Chari

|

Updated on: Jun 17, 2021 | 11:47 AM

Mohammad Azharuddin: గత కొంత కాలంగా అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులకు, అజారుద్దీన్‌కు మధ్య తీవ్ర విభేదాలు నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇరు వర్గాలు పరస్పర ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నాడని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ అధ్యక్షుడు అజారుద్దీన్ ను పదవినుంచి తప్పిస్తున్నట్లు హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ బుధవారం ప్రకటించింది. అలాగే ఆయన హెచ్‌సీఏ సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అజారుద్దీన్‌కు ఈనెల 10 న నోటీసులు జారీ చేయగా.. ఆయన స్పందించలేదంటూ.. ఈ చర్యలకు ఉపక్రమించింది.

ఈ విషయంపై తాజాగా మాజీ టీమిండియా క్రికెటర్ అజారుద్దీన్ స్పందించారు. ఈమేరకు ఓ లెటర్‌ను విడుదల చేశాడు. ఉద్దేశపూర్వకంగా అపెక్స్ కౌన్సిల్ సభ్యులు నాకు నోటీసులు జారీచేశారని పేర్కొన్నారు. అలాగే తానెప్పుడూ హెచ్‌సీఏ గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించలేదని, వ్యతిరేకంగా పనిచేయలేదని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్‌ లో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారని, కేవలం 5గురు సభ్యులు (జాన్ మనోజ్, విజయనంద్, నరేష్ శర్మ, సురేందర్ అగర్వాల్, అనురాధ) ఓ వర్గంగా ఏర్పడి ఇదంతాచేస్తున్నారని మండిపడ్డారు. వారు చేసిందే అపెక్స్‌ కౌన్సిల్ నిర్ణయంగా భావిస్తే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. హెచ్‌సీఏ లో జరుగుతున్న.. అలాగే ఇదివరకు జరిగిన అవినీతిని అరికట్టేందుకు సమర్థవంతమైన ఓ వ్యక్తిని అంబుడ్స్‌మెన్‌గా నియమిస్తే.. ఈ వర్గమే తప్పు పట్టిందని, దానికి కారణం వాళ్ల తప్పులు ఎక్కడ బయటపడతాయనే భయపడుతున్నారుని ఆరోపించారు. అందుకే నాపై కక్ష్య కట్టి ఇలా చేస్తున్నారని వాపోయారు.

అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తే.. ఆ అయిదుగురు సభ్యులు హాజరు కారని అజారుద్దీన్ ఆరోపించారు. ఈ ఐదుగురిపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. వీరి అవినీతికి నేను అడ్డుపడుతున్నాననే ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఐదుగురే మీటింగ్ పెట్టుకుని.. నాకు నోటీసులు పంపించారని, పైగా ఈ నోటీసులు అపెక్స్ కౌన్సిల్ ఇచ్చినట్టుగా మీడియాకు చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.

బీసీసీఐ ఏంచేస్తుంది..? ఈ వివాదం బీసీసీఐ వరకు చేరింది. కానీ, హెచ్‌సీఏ వివాదంపై బీసీసీఐ పెద్దగా స్పందించడం లేదు. అజారుద్దీన్ విషయంలో అపెక్స్‌ కౌన్సిల్‌ విభేదించినా… ఇటీవల జరిగిన ఎస్‌జీఎంలో హెచ్‌సీఏ ప్రతినిధిగా అజారుద్దీన్ హాజరయ్యేందుకు బీసీసీఐ అవకాశం కల్పించడం గమనార్హం. మరి ఈ అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయానికి చట్టబద్ధత ఉందా? లేదా అనే అంశంపై నేటికీ స్పష్టత లేదు. మరి ఇలాంటి నేపథ్యంలో అజారుద్దీన్‌ సభ్యత్వం కూడా రద్దు, ఆయనపై వేటు అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.

Also Read:

ఫుట్ బాల్ మాంత్రికుడు డీగో మారడోనాను డాక్టర్లే చంపారు….వారి నిర్లక్ష్యమే కారణం,….అర్జెంటినా నర్సు

Viral Video: పీఎస్ఎల్‌ లో రచ్చ చేసిన పాకిస్తాన్ క్రికెటర్లు..! కోపంతో ఊగిపోయిన షాహిన్‌ షా అఫ్రిది