AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Test Rankings: ర్యాంక్ మెరుగుపరుచుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..! ఏ ప్లేస్‌ లో ఉన్నాడంటే ..?

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో తన ర్యాంక్‌ ను మెరుగు పరుచుకున్నాడు. బుధవారం ఐసీసీ టెస్ట్‌ ర్యాకింగ్స్‌ను విడుదల చేసింది.

ICC Test Rankings: ర్యాంక్ మెరుగుపరుచుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..! ఏ ప్లేస్‌ లో ఉన్నాడంటే ..?
Virat Kohli
Venkata Chari
|

Updated on: Jun 17, 2021 | 12:25 PM

Share

ICC Test Rankings: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో తన ర్యాంక్‌ ను మెరుగు పరుచుకున్నాడు. బుధవారం ఐసీసీ టెస్ట్‌ ర్యాకింగ్స్‌ను విడుదల చేసింది. ఇంతకుముందు ఐదో స్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ.. తాజాగా ప్రకటించిన ర్యాకింగ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ ఇంగ్లండ్‌ సిరీస్‌లో అంతగా రాణించకపోవడంతో.. రెండో స్థానానికి పడిపోయాడు. మూడో స్థానంలో ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌ కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ సారథి జో రూట్‌ విఫలమవ్వడంతో ఐదో స్థానానికి పడిపోయాడు.

ఇక రేటింగ్‌ల పరంగా చూస్తే.. 891 రేటింగ్‌తో స్టీవ్‌ స్మిత్‌ తొలి స్థానంలో నిలవగా, 886 రేటింగ్‌తో కివీస్ సారథి కేన్ విలియమ్సన్‌ రెండో స్థానం, 814 రేటింగ్‌తో విరాట్‌ కోహ్లీ నాలుగో స్థానంలో నిలిచారు. టీమిండియా ఆటగాళ్లలో రిషబ్ పంత్‌ , రోహిత్‌ శర్మ 797 రేటింగ్‌తో ఇద్దరూ ఆరో స్థానంలో నిలిచారు.

బౌలర్ల విషయానికి వస్తే.. ప్యాట్‌ కమిన్స్‌ (908), రవిచంద్రన్‌ అశ్విన్‌ (850), టిమ్‌ సౌథీ (830) టాప్‌-3 లో కొనసాగుతున్నారు. కాగా టాప్‌-10లో అశ్విన్ మినహా టీమిండియా నుంచి వేరెవరూ చోటు దక్కించుకోలేకపోయారు. ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియా ప్లేయర్లైన అశ్విన్ 2, రవీంద్ర జడేజా 4 స్థానాల్లో నిలిచారు.

టీమ్ ర్యాంకింగ్స్‌లో 123 రేటింగ్‌తో కివీస్ తొలిస్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్‌ను 1-0తేడాతో గెలవడంతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. టీమిండియా 121 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తరువాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (108), ఇంగ్లండ్ (107), పాకిస్తాన్ (94) టీంలు నిలిచాయి.

Also Read:

Mohammad Azharuddin: వాళ్ల అవినీతి బయటికొస్తుందనే నాపై ఆరోపణలు: హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌

Viral Video: పీఎస్ఎల్‌ లో రచ్చ చేసిన పాకిస్తాన్ క్రికెటర్లు..! కోపంతో ఊగిపోయిన షాహిన్‌ షా అఫ్రిది

భార్య కోసం పాట పాడిన విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయినా అనుష్క శర్మ వైరల్ అవుతున్న వీడియో :Virushka Video.

Viral Video: శునకంతో రవిశాస్త్రి ప్రాక్టీస్.. విన్‌స్టన్‌ గుడ్‌బాయ్‌ అంటూ నెటిజన్ల పొగడ్తలు!