Viral Video: శునకంతో రవిశాస్త్రి ప్రాక్టీస్.. విన్‌స్టన్‌ గుడ్‌బాయ్‌ అంటూ నెటిజన్ల పొగడ్తలు!

Venkata Chari

Venkata Chari |

Updated on: Jun 16, 2021 | 8:00 PM

మంగళవారం ప్రాక్టీస్ ముగిసిన అనంతరం టీమిండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి శునకంతో సరదాగా ఆడుకున్నాడు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video: శునకంతో రవిశాస్త్రి ప్రాక్టీస్.. విన్‌స్టన్‌ గుడ్‌బాయ్‌ అంటూ నెటిజన్ల పొగడ్తలు!
Ravi Shastri Plays With Dog
Follow us

WTC Final 2021: మరో రెండు రోజుల్లో కివీస్‌తో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం టీమిండియా సిద్ధమౌతోంది. ఈ మేరకు భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో లీనమయ్యారు. సౌథాంప్టన్‌లోని ఏజీస్‌ బౌల్‌ గ్రౌండ్‌లో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నారు. అయితే మంగళవారం ప్రాక్టీస్ ముగిసిన అనంతరం టీమిండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి శునకంతో సరదాగా ఆడుకున్నాడు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ శునకాన్ని విన్‌స్టన్‌ అని ముద్దుగా పిలుచుకుంటాడంట రవిశాస్త్రి. ఈమేరకు టెన్నిస్ బాల్‌తో సరదాగా ఆడుకున్నారు. రవిశాస్త్రి బ్యాట్‌తో టెన్నిస్‌ బాల్‌ను కొట్టగానే.. ఆ బాల్‌‌ను నోటితో అందుకుని ఆయనకు అందించింది. క్యాచ్‌లు పట్టేందుకు తెగ ప్రయత్నించింది. ఈ మేరకు నెటిజన్లు విన్‌స్టన్ ప్రతిభను పొగుడుతూ ‘విన్‌స్టన్ గుడ్‌బాయ్’ అంటూ సరదాగా కామెంట్లు చేశారు. 15,000 పైగా లైక్స్‌తో ఈ వీడియో నెట్టింట్లో దూసుకపోతోంది.

మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం అంతా సిద్ధమైంది. భారత ఆటగాళ్లు నెట్స్‌లో బాగా శ్రమిస్తున్నారు. విరాట్‌ కోహ్లీ షార్ట్‌పిచ్‌ బంతులపై స్పెషల్ ఫోకస్ పెట్టగా, వైస్ కెప్టెన్ అజింక్య రహానె, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ సైతం నెట్స్‌ లో చెమటోడ్చారు.

సరదాగా సాగిన ఈ వీడియోలో విన్‌స్టన్‌ ప్రాక్టీస్‌ను మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

Also Read:

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఆటగాళ్లు సెంటిమెంట్‌కు బలవుతారా..? లేక సరికొత్త రికార్డులను సృష్టిస్తారా?

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా జట్టు ఇదే.. ఆ ప్లేయర్‌కు మరోసారి నిరాశ.. కోహ్లీపై విమర్శలు.!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu