డివిలియర్స్‌ను తలపించాడు.. 14 బంతుల్లో 64 పరుగులు రాబట్టాడు.. బౌలర్లకు చుక్కలు చూపించాడు..
టీ20 క్రికెట్ వచ్చిన దగ్గర నుంచి బ్యాట్స్‌మెన్ల ఊచకోత సర్వసాధారణం అయిపోయింది. రోహిత్ శర్మ, క్రిస్ గేల్, మ్యాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్.. ఇలా ప్రతీ జట్టుకు..
టీ20 క్రికెట్ వచ్చిన దగ్గర నుంచి బ్యాట్స్‌మెన్ల ఊచకోత సర్వసాధారణం అయిపోయింది. రోహిత్ శర్మ, క్రిస్ గేల్, మ్యాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్.. ఇలా ప్రతీ జట్టుకు ఓ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఉన్నాడు. క్రీజులోకి రావడంతోనే ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడతారు. అలాంటి ఓ విధ్వంసకర ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..
ఆరు అడుగుల ఐదు అంగుళాల ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ 80 నిమిషాల్లో పెను విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా సిక్సర్లు, ఫోర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్పిన్, పేస్ అని తేడా లేకుండా ప్రతీ బౌలర్‌ను 7 రన్ రేట్ దాటించాడు. అతనెవరో కాదు ఇంగ్లాండ్ విధ్వంసకర ఓపెనర్ అలెక్స్ హేల్స్.
అంతర్జాతీయ క్రికెట్‌లో చోటు దక్కపోయినా.. హేల్స్ డొమెస్టిక్ క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. నాటింగ్‌హామ్‌షైర్ తరపున ఆడుతున్న 32 ఏళ్ల అలెక్స్ హేల్స్ పరుగుల వరద పారిస్తున్నాడు. జూన్ 15న డర్హామ్‌తో ఆడిన టీ20 బ్లాస్ట్ మ్యాచ్‌లో అతడు చిన్నపాటి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో నాటింగ్‌హామ్‌షైర్ తొలుత బ్యాటింగ్ చేసి.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు చేసింది. ఓపెనర్‌గా దిగిన అలెక్స్ హేల్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
80 నిమిషాల పాటు క్రీజులో ఉన్న హేల్స్.. 54 బంతుల్లో 96 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అంటే దాదాపు 14 బంతుల్లో 64 పరుగులు రాబట్టాడు. కేవలం 4 పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయిన హేల్స్, ఓవరాల్ 177.77 స్ట్రైక్ రేట్‌తో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో నాటింగ్‌హామ్‌షైర్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, లక్ష్య చేధనలో భాగంగా డర్హామ్ జట్టు 20 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 182 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Also Read:
ఉదయాన్నే టిఫిన్ తిని స్నానం చేస్తున్నారా? అయితే జాగ్రత్త! ఈ విషయాలు తెలుసుకోండి
కారు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. బోనెట్ తెరిచి చూడగా ఫ్యూజులు ఔట్.!
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా జట్టు ఇదే.. ఆ ప్లేయర్‌కు మరోసారి నిరాశ.. కోహ్లీపై విమర్శలు.!
అత్తింటి మర్యాదా మజాకా.. కొత్త కోడలికి మెట్టు మెట్టుకో గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో..