AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Footwork Challenge: ‘మాలో ఎవరు బాగా చేశారని’ క్రికెటర్ చాహల్ ప్రశ్న? కపుల్ ఫుట్ వర్క్ ఛాలెంజ్‌ వీడియోతో ఆకట్టుకున్న జోడీ!

ఇన్‌స్టాగ్రామ్‌లో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌, అతని భార్య కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ చాలా యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం ఏదో ఒక ఫొటోనో, వీడియోనో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు.

Footwork Challenge: 'మాలో ఎవరు బాగా చేశారని' క్రికెటర్ చాహల్ ప్రశ్న? కపుల్ ఫుట్ వర్క్ ఛాలెంజ్‌ వీడియోతో ఆకట్టుకున్న జోడీ!
Yuzvendra Chahal
Venkata Chari
|

Updated on: Jun 16, 2021 | 3:15 PM

Share

Footwork Challenge: ఇన్‌స్టాగ్రామ్‌లో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌, అతని భార్య కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ చాలా యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం ఏదో ఒక ఫొటోనో, వీడియోనో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అలాగే ఫిట్‌నెస్‌ వీడియోలతోపాటు ట్రెండింగ్ అయ్యే సోషల్ మీడియా ఛాలెంజ్‌లతో వీడియోలు చేస్తూ ఇన్‌స్టాలో పంచుకుంటుంటారు. తాజాగా ఇలాంటి సోషల్ మీడియా ఛాలెంజ్‌ ఒక దానిని స్వీకరించారు. అదే కపుల్ ఫుట్ వర్క్ ఛాలెంజ్. దీనిలో భాగంగా వీరిద్దరు తమ కాళ్లను పాటకు తగ్గట్లుగా స్టెప్పులేయించి ఆకట్టుకున్నారు. ఈ మేరకు ఇన్‌స్టాలో దానికి సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు. మాలో ఎవరు బాగా చేశారంటూ ఫాలోవర్స్‌ను ప్రశ్నిస్తూ ట్యాగ్‌లైన్ చేర్చారు. ఈ వీడియోలో వీరి కాళ్ల కదలికలు అదుర్స్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరూ బాగా చేశారంటూ మరికొందరు కామెంట్లు ఇచ్చారు.

“ఫుట్‌వర్క్ సవాలు. ఎవరు బాగా చేశారు? ”అని వీడియోలో రాసుకొచ్చింది ధనశ్రీ వర్మ. ఆమె తన పోస్ట్‌లో యుజ్వేంద్ర చాహల్‌ను ట్యాగ్ చేసి, “మేము ఇక్కడ కొన్ని వైబ్‌లను సెట్ చేస్తున్నాం” అని రాశారు.

ఇదే వీడియోను చాహల్ షేర్ చేస్తూ.. “ఫుట్‌వర్క్ జంట” “ఎవరు బాగా చేశారు? నేనేకదా ” అంటూ తన పోస్ట్ ను పంచుకున్నాడు. ఈ పోస్టులో తన భార్యను టాగ్ చేశాడు.

Also Read:

Viral Video: యూరో 2020 ఫలితాలను ముందే చెప్పేస్తోన్న ప్రిడిక్షన్ పిల్లి! వీడియో వైరల్

స్వచ్ఛందంగా రక్తదానం చేసిన టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్… ప్రజలు కూడా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.:Sachin Donates Blood video.