WTC Final: అయ్యో.. ఆ రోజు వర్షం పడితే..! టెస్టు ఛాంపియన్‌షిప్‌లో విజేత ఎవరు..!
ICC WTC Final Weather Forecast: శుక్రవారం సౌథాంప్టన్ మైదానంలో జరిగే మెగా పోరుకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్ వేదికగా జరగనున్న ఈ టైటిల్ పోరులో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని...
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ పోరుకు రంగం సిద్దమవుతోంది. భారత్, న్యూజిలాండ్ రెండు జట్లు కసరత్తు మొదలు పెట్టాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం సౌథాంప్టన్ మైదానంలో జరిగే మెగా పోరుకుకౌంట్ డౌన్ మొదలైంది. ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్ వేదికగా జరగనున్న ఈ టైటిల్ పోరులో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు, కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో WTC ఫైనల్ జరగడం ఇదే తొలిసారి కావడంతో ఈ మెగా పోరుపై అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా కఠిన పరిస్థితులలో మ్యాచ్ చూద్దామని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలేట్లుంది.
సౌథాంప్టన్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్ష గడం పొంచివుందని తెలుస్తోంది. రిజర్వు డేతో కలిపి మొత్తం ఆరు రోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఇంగ్లండ్ వాతావరణ శాఖతోపాటు అక్కడి వెదర్ అప్‌డేట్ అందించే వెబ్‌సైట్లు ఈ విషయాన్నే చెపుతున్నాయి. దాదాపు 80 శాతం వర్షం కురుస్తుందని పేర్కొన్నాయి.
ఇదిలావుంటే.. వర్షం పడి చల్లని వాతావరణ ఉంటే మాత్రం కేన్ విలియమ్సన్ జట్టుకే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‌ను ఉదాహరణగా చూపిస్తున్నారు. సౌథీ, బౌల్ట్, హెన్రీ, జేమీసన్ తమ పేస్, స్వింగ్‌తో భారత్ బ్యాటర్లను ఇబ్బంది పెడతారని అంటున్నారు. అయితే టీమిండియా బౌలర్లూ తక్కువేం కాదని మొత్తంగా బ్యాటర్లకే ఇబ్బందులు ఉంటాయని కూడా పేర్కొన్నారు.
ఇప్పటికే న్యూజిలాండ్ ఐసీసీ టోర్నీల్లో ‘టై’ గండాలు అడ్డుగా మారుతున్నాయి. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మ్యాచులో, సూపర్ ఓవర్లలో స్కోర్లు సమం కావడంతో ప్రపంచకప్ ట్రోఫీ దక్కకుండా పోయింది. ఇప్పుడు టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ అలాంటి పరిణామాలే ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇద్దరినీ విజేతగా ప్రకటించడం మాత్రం ఊరట కలిగించేదే.
Weather forecast at the Rose Bowl. #WTCFinal #WTCFinal #NZvsIND https://t.co/hLHb7bsG11 pic.twitter.com/JhUprDqO1C
— Monty Panesar (@MontyPanesar) June 14, 2021