Deccan Chargers: బీసీసీఐకి భారీ ఊరట! డెక్కన్ ఛార్జర్స్‌ కేసును కొట్టేసిన బాంబే హైకోర్టు

గతకొంత కాలంగా డెక్కన్ ఛార్జర్స్‌ (డీసీ), బీసీసీఐల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఒకప్పటి ఐపీఎల్ టీం అయిన డెక్కన్ ఛార్జర్స్‌.. బాంబే హైకోర్టులో వేసిన ఓ కేసులో బీసీసీఐ కి అనుకూలంగా తీర్పు వచ్చింది.

Deccan Chargers: బీసీసీఐకి భారీ ఊరట! డెక్కన్ ఛార్జర్స్‌ కేసును కొట్టేసిన బాంబే హైకోర్టు
Bcci
Follow us
Venkata Chari

|

Updated on: Jun 16, 2021 | 2:29 PM

Deccan Chargers: గతకొంత కాలంగా డెక్కన్ ఛార్జర్స్‌ (డీసీ), బీసీసీఐల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఒకప్పటి ఐపీఎల్ టీం అయిన డెక్కన్ ఛార్జర్స్‌.. బాంబే హైకోర్టులో వేసిన ఓ కేసులో బీసీసీఐ కి అనుకూలంగా తీర్పు వచ్చింది. డీసీహెచ్‌ఎల్ (డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌) కు రూ. 4,800 కోట్లు చెల్లించాలంటూ ఆర్బిటర్ ఇచ్చిన ఆదేశాలను బాంబే హైకోర్టు కొట్టిపారేసింది. జ‌స్టిస్ జీఎస్ ప‌టేల్‌తో కూడిన బెంచ్ తాజాగా ఈ ఆదేశాల‌ను జారీ చేసింది. ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. కోర్టు తీర్పు భారీ ఊరటనిచ్చిందని, తాము అన్నీ అగ్రిమెంట్ ప్ర‌కార‌మే చేశామ‌ని తెలిపారు.

2008 నుంచి ఐదేళ్ల పాటు ఐపీఎల్‌లో దక్కన్‌ చార్జర్స్‌ టీం కొనసాగింది. 2009లో ఆ జట్టు ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టీమ్‌ను డీసీహెచ్‌ఎల్‌ కంపెనీ ప్రమోట్‌ చేసింది. కాగా, 2012లో డీసీహెచ్‌ఎల్‌ రూ.100 కోట్లకు షూరిటీ ఇవ్వడంలో విఫలమైందంటూ బీసీసీఐ షోకాజ్‌ నోటీసు పంపింది. దీంతో బీసీసీఐ, డీసీహెచ్‌ఎల్‌ ల మధ్య వివాదం రాజుకుంది. దీనిపై వివరణ ఇవ్వాలని ఛార్జర్స్‌కు 30 రోజుల గడువు ఇచ్చింది బీసీసీఐ. అయితే, ఈ గడువు పూర్తి కాకముందే 2012లో డీసీ టీమ్‌ను రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. దక్కన్‌ చార్జర్స్‌ స్థానంలో.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) చేరింది.

అయితే ఐపీఎల్‌ లీగ్‌ నుంచి డీసీ ని తప్పించడం చట్ట విరుద్ధమని డీసీహెచ్‌ఎల్‌ కంపెనీ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. నష్టపరిహారం, వడ్డీ, ఇతర ఖర్చుల కింద రూ. 8 వేల కోట్లు బీసీసీఐ చెల్లించాలని దక్కన్‌ ఛార్జర్స్‌ కోర్టును కోరింది. ఈ మేరకు బీసీసీఐ.. ఫ్రాంచైజీ ఫీజు కింద మిగిలిన ఐదేళ్లకు రూ. 214 కోట్లు డీసీ తమకు చెల్లించాలని కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత జట్టును రద్దు చేయడం సరైంది కాదంటూ కోర్టు అభిప్రాయపడింది. దీనికి నష్టపరిహారంగా రూ. 4,814.67 కోట్లతో పాటు ఆర్బిట్రేషన్‌ మొదలైన 2012నుంచి ఏడాదికి 10 శాతం వడ్డీ, ఖర్చులకు మరో రూ. 50 లక్షలు చెల్లించాలని బీసీసీఐని ఆదేశించింది. ఈ ఆదేశాల‌ను బీసీసీఐ కోర్టులో అప్పీల్ చేసింది. దీంతో బాంబే హైకోర్టు తాజా తీర్పును వెల్లడించింది.

Also Read:

60 Off 13 Balls : 13 బంతుల్లో 60 పరుగులు..! ఈ వికెట్ కీపర్ మాములోడు కాదు చుక్కలు చూపించాడు..

Virushka: భార్య కోసం పాట పాడిన విరాట్ కోహ్లీ; భావోద్వేగంతో అనుష్క కన్నీరు.. వీడియో వైరల్!