AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virushka: భార్య కోసం పాట పాడిన విరాట్ కోహ్లీ; భావోద్వేగంతో అనుష్క కన్నీరు.. వీడియో వైరల్!

క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మన ఇండియన్ క్రికెటర్లకు, బాలీవుడ్ హీరోయిన్లకు మధ్య విడదీయరాని బంధం ఉంటుందనడంలో సందేహం లేదు.

Virushka: భార్య కోసం పాట పాడిన విరాట్ కోహ్లీ; భావోద్వేగంతో అనుష్క కన్నీరు.. వీడియో వైరల్!
Virushka
Venkata Chari
|

Updated on: Jun 16, 2021 | 12:11 PM

Share

Virushka: క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మన ఇండియన్ క్రికెటర్లకు, బాలీవుడ్ హీరోయిన్లకు మధ్య విడదీయరాని బంధం ఉంటుందనడంలో సందేహం లేదు. పటౌడీ నుంచి కోహ్లీ వరకు చాలామంది జంటలుగా మారారు. 2017 లో ఇటలీలో ఈ జంట వివాహం చేసుకున్నారు. చాలా రహస్యంగా వీరి పెళ్లి జరిగింది. అనంతరం చాలా రోజుల తరువాత వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేశాయి.

ఇదిలా ఉంటే భార్య కోసం పాటపాడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు విరాట్ కోహ్లీ. ఆటగాడిగా అందర్నీ అలరించిన కోహ్లీ.. తనలో మరో టాలెంట్‌ను బయటకు తీసి వాహ్ అనిపించాడు. పెళ్లి సమయంలో తన భార్య అనుష్క కోసం ‘మేరే మెహబూబ్ ఖయామత్ హోగి’  అనే బాలీవుడ్ పాట పాడాడు. అయితే, ఈ వీడియో వీరి పెళ్లి సమయంలో తీసినట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో  వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో.. విరాట్ పాడుతుండగా..కుటుంబ సభ్యులు, స్నేహితులు చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. విరాట్ ఈ పాటను తన భార్య అనుష్కకు అంకితం చేశాడు. దీంతో అనుష్క ఎంతో భావోద్వేగానికి గురైంది.

ప్రేమతో ‘విరుష్కా’ అని పిలిచే ఈ జంటకు ఈ ఏడాది జనవరిలో ఒక పాప జన్మించిన సంగతి తెలిసిందే. ఈ పాపకు ‘వామికా’ అని పేరు పెట్టారు. పాప పేరును మాత్రమే ప్రపంచానికి పరిచయం చేశారు. పాప రూపాన్ని మాత్రం ఇంకా చూపించలేదు.

కాగా, అనుష్క శర్మ ‘రబ్ నే బనాది జోడి’ (2008) తో సినీరంగ ప్రవేశం చేశారు. సుల్తాన్, బ్యాండ్ బాజా బారాత్, దిల్ ధడక్నే దో, ఏ దిల్ హై ముష్కిల్, సుయి ధాగా లాంటి ఎన్నో సినమాల్లో నటించి పేరు సంపాదించింది. తన సోదరుడు కర్నేశ్ శర్మతో కలిసి 2013 లో క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ ను స్థాపించి, ఈ బ్యానర్ లో అనుష్క ప్రధాన పాత్రలో ఎన్‌హెచ్ 10, పారి, ఫిలౌరి వంటి చిత్రాలను నిర్మించింది.

మరోవైపు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ కోసం విరాట్ సిద్ధమయ్యాడు. తన భార్య అనుష్క, కుమార్తె వామికాతో కలిసి విరాట్ ఇంగ్లాండ్‌ టూర్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే.

Also Read:

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా జట్టు ఇదే.. ఆ ప్లేయర్‌కు మరోసారి నిరాశ.. కోహ్లీపై విమర్శలు.!

Virat And Williamson: విల‌య‌మ్‌స‌న్‌ను విరాట్ కోహ్లీ అవుట్ చేసిన వేళ‌.. వైర‌ల్ అవుతోన్న 2008 నాటి వీడియో..