Smart Phone: స్మార్ట్ ఫోన్ కెమేరాతో చెడు బాక్టీరియాను గుర్తించవచ్చట.. అమెరికా సైంటిస్ట్స్ అద్భుత ఆవిష్కరణ!

Smart Phone: బాక్టీరియా.. కంటికి కనిపించని ఈ జీవుల్లో మనకు మంచి చేసేవి ఉన్నాయి.. చెడు చేసేవీ ఉన్నాయి. మంచి చేసే వాటి గురించి మనకు ఎలానూ బెంగ అక్కర్లేదు. కానీ, చెడు చేసే బాక్తీరియతోనే సమస్య.

Smart Phone: స్మార్ట్ ఫోన్ కెమేరాతో చెడు బాక్టీరియాను గుర్తించవచ్చట.. అమెరికా సైంటిస్ట్స్ అద్భుత ఆవిష్కరణ!
Smart Phone
Follow us
KVD Varma

|

Updated on: Jun 17, 2021 | 7:38 PM

Smart Phone: బాక్టీరియా.. కంటికి కనిపించని ఈ జీవుల్లో మనకు మంచి చేసేవి ఉన్నాయి.. చెడు చేసేవీ ఉన్నాయి. మంచి చేసే వాటి గురించి మనకు ఎలానూ బెంగ అక్కర్లేదు. కానీ, చెడు చేసే బాక్తీరియతోనే సమస్య. మన చుట్టూ కోటాను కోట్ల బాక్తీరియాలో చెడు చేసే బాక్టీరియాను కనిపెట్టడం మాట అటుంచి కనీసం చూసే అవకాశమూ లేదు. ఒకవేళ మనకి ఈ చెడు చేసే బాక్టీరియా కనిపించింది అనుకోండి ఎలా ఉంటుంది. చాలా వరకూ బాక్టీరియాతో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ దొరికేసినట్టే కదా. ఎక్కడ చెడు బాక్టీరియా ఉంటె అక్కడ జాగ్రత్తగా దానిని చంపేసో.. పక్కకు జరిపేసో మన పని మనం చేసుకుపోతాం. ఇదిగో మనకి చెడు చేసే బాక్టీరియా కనిపించే విధంగా మొబైల్ ఫోన్ కెమెరా రూపొందిస్తున్నారు సైంటిస్టులు. ఇది పెద్ద శుభవార్తే కదా..

ఇప్పుడు మొబైల్ ఫోన్ కెమెరాతో కూడా బ్యాక్టీరియాను గుర్తించవచ్చు అంటున్నారు. అమెరికన్ శాస్త్రవేత్తలు మొబైల్ కెమెరాను కొద్దిగా మార్చారు. దానిని LED బ్లాక్ లైట్తో అనుసంధానించారు. ఈ కెమెరాతో మానవ నాలుక స్కాన్ చేసి చూశారు. ఈ సమయంలో, దంతాలపై బ్యాక్టీరియా మెరుస్తూ కనిపించింది. మొటిమల బ్యాక్టీరియాను కూడా దాని సహాయంతో చూడవచ్చని తేలింది.

దీనిని తయారు చేసిన వాషింగ్టన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు దీనిని ఇంట్లో పరీక్షించగలుగుతామని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌లు వాడుతున్నారు. అందువల్ల ఈ విధానం ఉపయోగించడం వారికి సులువే అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అలాగే ఇవి ప్రజల బడ్జెట్‌లో ఉంటాయనీ అదేవిధంగా బ్యాక్టీరియాను పరీక్షించడం వారికి సులభం అవుతుందనీ అంటున్నారు. ఈ పరికరం సహాయంతో, ఇంట్లో ఉన్నవారు బ్యాక్టీరియా ఉందో లేదో చాలా సులభంగా తెలుసుకోగలుగుతారు. చర్మం మరియు నోటి బ్యాక్టీరియా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని పరిశోధకుడు డాక్టర్ రుయికాంగ్ వాంగ్ చెప్పారు. నోటిలోని దంతాలు మరియు చిగుళ్ళలోని బాక్టీరియా గాయాల వైద్యం రేటును తగ్గిస్తుంది. బ్యాక్టీరియాను పరీక్షించడానికి 3 డి రింగ్ మొబైల్ కెమెరాలో 10 ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేశారు పరిశోధకులు. బ్యాక్టీరియా ప్రత్యేక తరంగాలను విడుదల చేస్తుంది, కాబట్టి ఇది సాధారణ మొబైల్ కెమెరాల ద్వారా పట్టుబడదు. కానీ వాటి తరంగాలు బ్లాక్ ఎల్ఈడి లైట్ ద్వారా గుర్తించదానికి వీలుంది. దీంతో ఈ పరీక్షల్లో అక్కడ బ్యాక్టీరియా ఉందని ఈ పరికరంతో కనుక్కోగలిగారు.

పరిశోధకుడు డాక్టర్ క్విన్హువా (Qinghua) LED కాంతి వెలిగించి ఉన్నప్పుడు, బాక్టీరియా నుండి విడుదల పోర్ఫిరిన్ అణువు (porphyrin) ఒక ప్రత్యేక రకం ఎరుపు ప్రకాశిస్తూ సిగ్నల్ ఇస్తుంది అని చెప్పారు. ఇది స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా తెలుసుకోగలిగాం అన్నారు. చర్మ గాయాలు నయం కానప్పుడు, చాలా బ్యాక్టీరియా ఉంటుంది. అందువల్ల పోర్ఫిరిన్ అణువు చర్మంపై ఎక్కువగా కనిపిస్తుంది అని డాక్టర్ క్విన్హువా చెప్పారు.

Also Read: Instagram Bug: ఇన్‌స్టాగ్రామ్‌లో బగ్‌.. ఏకంగా రూ. 22 లక్షలు తెచ్చిపెట్టింది! జాక్‌పాట్ కొట్టిన ముంబై కుర్రాడు

5G Technology: భారత్ లో 5జి టెక్నాలజీ త్వరలో.. దీనితో లక్షల్లో ఉద్యోగావకాశాలు దొరికే ఛాన్స్!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?