Lay Off 30 Lakh IT Employees: ఐటీ రంగంలో నైపుణ్యం లేకుంటే అంతే.. 2022 నాటికి దేశంలో 30 లక్షల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు గల్లంతు!

పరిశ్రమలన్నీ ఆటోమేషన్‌కు మారిపోతున్న తరుణంలో టెక్నాలజీ రంగంలో ఉన్న దేశీయ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు కూడా వేగంగా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.

Lay Off 30 Lakh IT Employees: ఐటీ రంగంలో నైపుణ్యం లేకుంటే అంతే.. 2022 నాటికి దేశంలో 30 లక్షల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు గల్లంతు!
It Firms To Lay Off 30 Lakh Employees
Balaraju Goud

|

Jun 17, 2021 | 7:07 PM

Lay Off 30 Lakh IT Employees: అన్ని రంగాల్లో సాంకేతికత వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో యాంత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. పరిశ్రమలన్నీ ఆటోమేషన్‌కు మారిపోతున్న తరుణంలో టెక్నాలజీ రంగంలో ఉన్న దేశీయ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు కూడా వేగంగా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. దీని ప్రభావంతో వచ్చే ఏడాది నాటికి దేశంలో 30 లక్షల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కోల్పోవలసి వస్తందని బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశీయ సాఫ్ట్‌వేర్ రంగంలో 1.6 కోట్ల మందికిపైగా పనిచేస్తుండగా 2022 నాటికి తక్కువ నైపుణ్యాలు కలిగిన 30 లక్షల మందిని తగ్గించుకోవాలని ఆయా సంస్థలు భావిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ఫలితంగా ఏడాదికి దాదాపు రూ. 7.5 లక్షల కోట్లు ఆదా చేసుకోవాలని భావిస్తున్నాయని తెలిపింది.

బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా (బోఫా) తాజా నివేదిక విడుదల చేసింది. తత్ఫలితంగా భారత సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగుల సంఖ్య 2022 నాటికి 30 లక్షల మేర తగ్గవచ్చని నివేదిక వెల్లడించింది. దీంతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు ఏటా 10,000 కోట్ల డాలర్ల మేర (సుమారు రూ.7.3 లక్షల కోట్లు) ఆదా అవుతుందని అంచనా వేస్తోంది. ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీల ప్రాతినిథ్య మండలి నాస్కామ్‌ ప్రకారం.. దేశీయ ఐటీ రంగంలో 1.6 కోట్ల మంది పనిచేస్తున్నారు. అందులో 90 లక్షల మంది తక్కువ నైపుణ్యంతో కూడిన సేవలందిచేవారు, బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌ (బీపీఓ) విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నవారే. ఈ 90 లక్షల మందిలో 30 శాతం మంది అంటే 30 లక్షల మంది వచ్చే ఏడాది నాటికి ఉద్యోగాలు కోల్పోవచ్చని, ఇందుకు ప్రధాన కారణాల్లో రోబో ప్రాసెస్‌ ఆటోమేషన్‌ (ఆర్‌పీఏ) ఒకటి కారణం కానుందని బోఫా వెల్లడించింది. ఆర్‌పీఏ ఏకంగా 7 లక్షల మందిని భర్తీ చేయవచ్చని, సాంకేతిక ఆధునీకరణ, అప్‌స్కిల్లింగ్‌ కారణంగా మిగతా ఉద్యోగాలు మాయం కానున్నాయని రిపోర్టు పేర్కొంది.

ఇదిలావుంటే, కరోనా మహమ్మారి మిగిల్చిన విపత్తు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతితో యువత, వయసు పైబడిన వారే అధికంగా ఉద్యోగాలు కోల్పోయినట్లు ఫైనాన్షియల్‌ టెక్నాలజీ కంపెనీ ఎఫ్‌ఐఎస్‌ తాజా సర్వే వెల్లడించింది. ఏప్రిల్‌లో జరిపిన ఈ సర్వేలో భాగంగా భారత్‌లో 2,000 మంది నుంచి వివరాలు సేకరించిందీ సంస్థ. సర్వేలో పాల్గొన్న 55 ఏళ్లకు పైబడినవారిలో 6 శాతం మంది కరోనా సంక్షోభం కారణంగా తమ ఉద్యోగాన్ని శాశ్వతంగా కోల్పోవల్సి వచ్చిందని పేర్కొన్నట్లు నివేదించింది. ఇక, 24 ఏళ్ల లోపు వారిలో 11 శాతం మంది శాశ్వతంగా ఉద్యోగం కోల్పోయామని వెల్లడించారు.

భారత్‌ అవసరాల కోసం పనిచేస్తున్న ఒక్కో ఉద్యోగి సరాసరి వార్షిక వేతనం 25,000 డాలర్లు కాగా, అమెరికా అవసరాల కోసం పనిచేస్తున్న వారికి 50,000 డాలర్ల మేర చెల్లిస్తున్నారు. తొలగించాలని భావిస్తున్న వారికి చెల్లిస్తున్న వార్షిక వేతనాలు, ఇతర వ్యయాల కోసం సుమారు రూ.7.5 లక్షల కోట్ల మేర కార్పొరేట్‌ సంస్థలు ఆదా చేసుకోవాలని చూస్తున్నాయని నివేదిక వివరించింది. ఇక, ఆర్‌పీఏ అప్‌-స్కిల్లింగ్‌తో 2022 నాటికి తక్కువ నైపుణ్యం ఉన్న 30 లక్షల మందిని తగ్గించుకోవాలని టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌, టెక్‌ మహీంద్రా, కాగ్నిజెంట్‌ సహా పలు సంస్థలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయని నివేదిక పేర్కొంది. మనుషులతో పోలిస్తే రోబోలు 24 గంటలు పని చేస్తాయని, ఆర్‌పీఏను ఐటీ సంస్థల్లో విజయవంతంగా అమలు చేస్తే 10:1 నిష్పత్తిలో వ్యయాలు ఆదా అవుతాయని నివేదిక తెలిపింది.

రోబో ప్రాసెస్‌ ఆటోమేషన్‌ అనేది ఒక సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌. ఫిజికల్‌ రోబోలు కాదు. రోజువారీ సాధారణ, అధిక పరిమాణంలో ఉండే విధులు వంటివి వీటితో చేయించుకోవచ్చు. ఉద్యోగులు మరింత విభిన్న పనుల మీద దృష్టి పెట్టేందుకు దోహదం చేస్తుంది. సాధారణ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లకు భిన్నంగా ఆర్‌పీఏ ఉంటుంది. దేశీయ ఐటీ రంగానికి ఆఫ్‌షోరింగ్‌ ఎంతగానో సాయం చేసింది. 1998లో జీడీపీలో ఈ రంగం వాటా 1 శాతం ఉండగా, ఇవాళ అది 7 శాతానికి చేరింది.

అసెంచర్‌, క్యాప్‌జెమిని, అటాస్‌ వంటి కంపెనీలు 2005-19 మధ్య 18 శాతం వార్షిక ఆదాయ వృద్ధి నమోదు చేశాయి. ఇప్పటివరకు తక్కువ వ్యయమయ్యే భారత్‌ వంటి దేశాలకు ఆర్డర్లు ఇచ్చిన విదేశీ సంస్థలు, ఇప్పుడు ఆయా దేశాల ప్రభుత్వ విధానాల వల్ల ఈ విధానాన్ని ఉపసంహరించుకుంటున్నాయి. ఇది కూడా ఇక్కడ ఉద్యోగాల తొలగింపునకు కారణమవుతుందని నివేదిక వివరించింది.. డిజిటల్‌ సరఫరా వ్యవస్థలను సురక్షితంగా ఉంచుకునేందుకు అభివృద్ధి చెందిన దేశాల్లోని సంస్థలు కూడా ఆర్‌పీఏ ను వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. యాంత్రీకరణ ఇంతగా ఉన్నా కూడా, జర్మనీ (26 శాతం), చైనా (7 శాతం), భారత్‌ (5 శాతం), కొరియా, బ్రెజిల్‌, థాయిలాండ్‌, మలేషియా, రష్యా కూడా నిపుణుల కొరతను ఎదుర్కోనున్నాయి. నైపుణ్యాలు కలిగిన వారి లభ్యత లేకపోవడమే ఆటోమేషన్‌ వేగవంతానికి కారణమని నివేదిక చెబుతోంది.

Read Also…  KTR’s letter to Nirmala Sitharaman : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu