Rythu Bandhu: అత్యధిక లబ్ధిదారులు ఈ జిల్లా రైతులే.. చురుగ్గా సాగుతున్న రైతు బందు పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ కార్యక్రమం ఉత్సాహం సాగుతున్నది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుబంధు నిధుల పంపిణీ కొనసాగుతోందని వ్యవసాయశాఖ అధికారులు..

Rythu Bandhu: అత్యధిక లబ్ధిదారులు ఈ జిల్లా రైతులే.. చురుగ్గా సాగుతున్న రైతు బందు పంపిణీ
Rythu Bandhu
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 18, 2021 | 11:29 AM

తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ కార్యక్రమం ఉత్సాహం సాగుతున్నది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుబంధు నిధుల పంపిణీ కొనసాగుతోందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం 7.05 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1153.50 కోట్లు జమ కానున్నాయని వెల్లడించారు. 58.85 లక్షల ఎకరాలకు సంబంధించి రూ.2,942.27 కోట్లు జమ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 42.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో సాయం డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. తొలి మూడు రోజుల్లో రైతుబంధు కింద రూ.1153.50 కోట్లు జ‌మ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

మూడు రోజులలో 42.43 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు కింద 58.85 లక్షల ఎకరాలకు గాను రూ.2942.27 కోట్లు జమ చేసినట్లుగా ప్రకటించారు. నాలుగో రోజూ నల్లగొండకే అత్యధికం 53,381 మంది రైతులకు 1,82,542 ఎకరాలకు గాను రూ.91.27 కోట్లు పంపిణీ చేసినట్లుగా తెలిపారు. కాగా అత్యల్పం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2300 మంది రైతులకు గాను 7212 ఎకరాలకు 36.05 లక్షలు చెల్లించామన్నారు.మొత్తం నాలుగు రోజులలో రైతుబంధు కింద రైతుల ఖాతాలలో రూ.4095.77 కోట్లు జమ కానున్నాయని అన్నారు.

ఇక రుతుపవనాలు సకాలంలో రాష్ట్రాన్ని తాకడంతో రైతులు పనులను మొదలు పెట్టారు. రైతులకు ఎకరానికి రూ.5వేల చొప్పున ఏడాదికి రెండు విడుతల్లో రూ.10వేల చొప్పున ప్రభుత్వం సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. బ్యాంకుల నుంచి డబ్బులు విత్‌ డ్రా చేసుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు ఈ డబ్బులను రైతులు ఉపయోగించుకుంటారని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : CJI NV Ramana: శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివారిని ద‌ర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ దంప‌తులు..

CM Mamata: పంతం వీడని మమతా…సువేందు అధికారి గెలుపుపై కలకత్తా హైకోర్టులో పిటిషన్..

Tipu Sultan: సీఎం జగన్ సొంత జిల్లాలో కొత్త వివాదం.. టిప్పు సుల్తాన్‌ విగ్రహ ఏర్పాటుపై కమలం నేతల ఆందోళన

AP Job Calendar: నిరుద్యోగులకు శుభ వార్త.. జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి జగన్