CM Mamata: పంతం వీడని మమతా…సువేందు అధికారి గెలుపుపై కలకత్తా హైకోర్టులో పిటిషన్..

CM Mamata moved to High Court: నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి గెలుపును సవాల్ చేస్తూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో..

CM Mamata: పంతం వీడని మమతా...సువేందు అధికారి గెలుపుపై కలకత్తా హైకోర్టులో పిటిషన్..
Cm Mamata Moved To High Cou
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 18, 2021 | 8:52 AM

నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి గెలుపును సవాల్ చేస్తూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి బరిలో దిగిన మమతా .. 2000 ఓట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. లంచం, ద్వేషం, శత్రుత్వాన్ని పెంపొందించడం, మతం, బూత్‌ల ఆధారంగా ఓట్లు కోరడం.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఫారమ్ 17 సిలో అవకతవకలు.. నమోదయిన ఓట్ల సంఖ్య.. ఫలితాల్లో అక్రమాలకు పాల్పడినట్టు మమతా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు… రీకౌంటింగ్ చేపట్లాలన్న తన అభ్యర్థనను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చడాన్ని కూడా మమతా సవాల్ చేశారు. సువేందు అధికారి అనేక అవినీతి, అక్రమాలకుకు పాల్పడ్డారు అంటూ అందులో పేర్కొన్నారు.

మూడు రోజుల కిందటే ఈ పిటిషన్ దాఖలు కాగా.. శనివారం విచారణకు రానుంది. జస్టిస్ కౌసిక్ చందా ధర్మాసనం శనివారం విచారణల జాబితాలో మమతా పిటిషన్‌ను మొదటి అంశంగా తీసుకున్నారు. ఈ అంశంపై విచారణ జస్టిస్ చందా ధర్మాసనానికి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి కేటాయించారు.

మే 2న జరిగిన ఓట్ల లెక్కింపు సందర్భంగా నందిగ్రామ్‌ కౌంటింగ్‌ సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా 11 రౌండ్లలో అధికారి వెనుకంజలో ఉన్నప్పటికీ.. తర్వాత నాలుగు రౌండ్లలో ఆయన అనూహ్యంగా పుంజుకున్నారు. ఓ దశలో ఏకంగా 11 వేల ఓట్ల తేడాతో ముందంజలో చేరుకున్నారు.

దీనిపై సీఎం మమతా అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. కౌంటింగ్‌ సమయంలో 4 గంటల పాటు సర్వర్‌ డౌన్‌ అయ్యిందని.. ఆ సమయంలో అవకతవకలు జరిగి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాను గెలుపొందానని.. దానికి గవర్నర్‌ సైతం శుభాకాంక్షలు తెలియజేశారని అంటూ ముందు నుంచి వాదిస్తున్నారు. రీకౌంటింగ్‌ కోరినప్పటికీ ఎన్నికల సంఘం ఒప్పుకోలేదు.

ఇవి కూడా చదవండి : Tipu Sultan: సీఎం జగన్ సొంత జిల్లాలో కొత్త వివాదం.. టిప్పు సుల్తాన్‌ విగ్రహ ఏర్పాటుపై కమలం నేతల ఆందోళన

AP Job Calendar: నిరుద్యోగులకు శుభ వార్త.. జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి జగన్

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!