Helpline Number: సైబర్‌ నేరగాళ్ల ఆన్‌లైన్‌ మోసాలకు హెల్ప్‌లైన్‌ చెక్‌.. వెంటనే ఫిర్యాదు చేస్తే డబ్బులు వెనక్కి

Helpline Number: మీరు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారా..? వారి మాటలు నమ్మి ఈ డబ్బును బదిలీ చేశారా.? అలాగే ఓటీపీలు, క్రెడిట్‌ కార్డుల వివరాలు చెప్పేశారా..? సాధారణంగా..

Helpline Number: సైబర్‌ నేరగాళ్ల ఆన్‌లైన్‌ మోసాలకు హెల్ప్‌లైన్‌ చెక్‌.. వెంటనే ఫిర్యాదు చేస్తే డబ్బులు వెనక్కి
Helpline Number
Follow us
Subhash Goud

|

Updated on: Jun 18, 2021 | 8:56 AM

Helpline Number: మీరు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారా..? వారి మాటలు నమ్మి ఈ డబ్బును బదిలీ చేశారా.? అలాగే ఓటీపీలు, క్రెడిట్‌ కార్డుల వివరాలు చెప్పేశారా..? సాధారణంగా ఇలాంటి విషయాలు జరిగిన తర్వాత సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోవాల్సిందే. ఇలా ఈ మధ్య కాలంలో రోజురోజు సైబర్‌ నేరగాళ్ల మోసాలు పెరిగిపోతున్నాయి. అమాయకులను అసరగా చేసుకుని ఫోన్‌లో చేస్తూ నట్టేట ముంచుతున్నారు. బ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నమంటూ కస్టమర్‌ వ్యక్తి గత వివరాలు తెలుసుకుంటున్నారు. అలాగే బాధితుడి నుంచి వారి అకౌంట్లో వేసుకునే విధంగా చేస్తున్నారు. దీంతో బాధితులు మోసపోయిన తర్వాత లబోదిబోమంటున్నారు. తర్వాత సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి మోసాలను నిలిపివేసి నేరగాళ్ల అకౌంట్లను స్తంభింపజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. కస్టమర్ల ఖాతాల్లో డబ్బులు పోయినట్లు గుర్తించగానే వెంటనే ఫిర్యాదు చేసేందుకు కేంద్ర హోంశాఖ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 155260 అమల్లోకి తీసుకువచ్చింది. ఏప్రిల్‌లో ఈ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం ఇది దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది.

ఆర్బీఐ సహా అన్ని ప్రధాన బ్యాంకులు, పేమెంట్‌ బ్యాంకులు, వ్యాలెట్లు, ఆన్‌లైన్‌ వాణిజ్య సంస్థ సహకారంతో ఈ హెల్ప్‌లైన్‌ను హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో–ఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సి) నిర్వహిస్తోంది. ఈ మేరకు సిటిజెన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్, మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను డెవలప్‌ చేసింది. ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో (ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌) హెల్ప్‌లైన్‌ అమల్లో ఉంది. డబ్బును ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేసిన తర్వాత త్వరగా ఫిర్యాదు చేస్తే వెనక్కి రప్పించడానికి అవకాశం ఉంటుందని ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సదరు డబ్బు డిజిటల్‌ ఎకోసిస్టమ్‌ నుంచి బయటకు వెళ్లక ముందే అప్రమత్తమైతే చాలావరకు వెనక్కి వస్తుందని అధికారులు వెల్లడిస్తున్నారు. బాధితులకు మాయమాటలు చెప్పి తస్కరించిన సొమ్మును సైబర్‌ నేరస్థులు ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు.. ఇలా ఐదు బ్యాంకుల ఖాతాల్లోకి మార్చినప్పటికీ సిటిజెన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్, మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా అధికారులు వెనక్కి రప్పించగలిగారు. ఇలా రోజురోజుకు సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నందున కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇవీ కూడా చదవండి:

Helmet: మెదడు పని తీరును తెలుసుకునే హెల్మెట్‌.. అభివృద్ధి చేసిన అమెరికాకు చెందిన కెర్నల్‌ సంస్థ

Aadhaar Card Update: ఆధార్ కార్డులో మీ పుట్టిన తేదీ, ఇతర వివరాలు తప్పుగా ఉన్నాయా..? లింక్ ద్వారా మార్చండి