Aadhaar Card Update: ఆధార్ కార్డులో మీ పుట్టిన తేదీ, ఇతర వివరాలు తప్పుగా ఉన్నాయా..? లింక్ ద్వారా మార్చండి

Aadhaar Card Update: మీ ఆధార్‌ కార్డులో పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలు తప్పుగా ఉన్నాయా..? అయితే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆధార్‌లో వివరాలన్ని సరైనవిగా..

Aadhaar Card Update: ఆధార్ కార్డులో మీ పుట్టిన తేదీ, ఇతర వివరాలు తప్పుగా ఉన్నాయా..? లింక్ ద్వారా మార్చండి
Aadhar Card
Follow us
Subhash Goud

|

Updated on: Jun 18, 2021 | 7:23 AM

Aadhaar Card Update: మీ ఆధార్‌ కార్డులో పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలు తప్పుగా ఉన్నాయా..? అయితే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆధార్‌లో వివరాలన్ని సరైనవిగా ఉంటేనే పనులు జరుగుతాయి. లేకపోతే ఏ పనులు జరగవు. మీరు బ్యాంకు అకౌంట్‌ తీయాలన్నా.. పాన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా.. ఇంకా చాలా పనులకు ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ఇబ్బందులే. అలాగే కేవైసీ విషయంలో పుట్టిన తేదీ కూడా ముఖ్యమైనదే. అయితే ఆధార్‌ కార్డులో ఈ వివరాలు తప్పుగా ఉంటే సరి చేసుకునే అవకాశం ఉంది. ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చడానికి ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే పుట్టిన తేదీ మార్చుకునే అవకాశం కల్పిస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అవకాశం కల్పిస్తోంది. మరి ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని ఎలా సరిచేసుకోవాలో తెలుసుకోండి. అయితే మీ ఆధార్‌కు మీ మొబైల్‌ నెంబర్‌ రిజిస్ట్రేషన్‌ అయి ఉండాలి.

ఆధార్‌లో మార్చండిలా..

➦ ఆధార్ కార్డు హోల్డర్లు ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ https://ssup.uidai.gov.in/ssup/ ఓపెన్ చేయాలి. ➦ Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి. ➦ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ➦ క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. ➦ Sent OTP పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్‌కు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ➦ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయాలి. ➦ మీ ఆధార్ వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. ➦ అందులో పుట్టిన తేదీని మార్చాలి. ➦ యూఐడీఐఏ సూచించిన ఐడీ ప్రూఫ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. ➦ ఏ డాక్యుమెంట్స్‌ని యూఐడీఐఏ అనుమతి ఇస్తుందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ➦ ఐడీ ప్రూఫ్ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసిన తర్వాత Submit పైన క్లిక్ చేయాలి.

➦ మీరు రిక్వెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీ వివరాలను, మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్‌ని పరిశీలించి యూఐడీఏఐ మీ పుట్టిన తేదీని, ఇతర వివరాలను సరిచేస్తుంది. మీ రిక్వెస్ట్ స్టేటస్ తెలుసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.

► https://ssup.uidai.gov.in/ssup/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ► Check Update Status పైన క్లిక్ చేయండి. ► ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి Sent OTP పైన క్లిక్ చేయండి. ► మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి. ► Check Status పైన క్లిక్ చేస్తే మీ రిక్వెస్ట్ స్టేటస్ తెలుస్తుంది.

ఇవీ కూడా చదవండి:

Aadhaar Update: ఆధార్‌ కార్డులో పేరు, ఇతర వివరాలు మార్చాలనుకుంటే ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి..?

Cooking Oil Price: సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన వంట నూనె ధరలు.. ప్రకటించిన కేంద్రం ప్రభుత్వం