- Telugu News Photo Gallery Business photos Update name date of birth and address in aadhaar card by using this documents
Aadhaar Update: ఆధార్ కార్డులో పేరు, ఇతర వివరాలు మార్చాలనుకుంటే ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి..?
ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ మార్చుకోవాలా? ఏ ఏ డాక్యుమెంట్లు కావాలో తెలుసుకోండి! ప్రస్తుతం అన్ని అవసరాలకు ఉపయోగపడే ముఖ్యమైన డాక్యుమెంట్లలో..
Updated on: Jun 17, 2021 | 2:01 PM

ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ మార్చుకోవాలా? ఏ ఏ డాక్యుమెంట్లు కావాలో తెలుసుకోండి! ప్రస్తుతం అన్ని అవసరాలకు ఉపయోగపడే ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ ఇప్పడు చాలా వాటికి అవసరం అవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల ప్రయోజనాలు పొందాలన్నా తప్పకుండా ఆధార్ కావాల్సిందే. అందువల్ల ఆధార్ కార్డు చాలా కీలకమైందని చెప్పవచ్చు. అందువల్ల ఆధార్ కార్డులో వివరాలు కూడా సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. పేరు, అడ్రస్, పుట్టిన తేదీ వంటి వాటిల్ల ఏమైనా తప్పులు ఉంటే.. సులభంగానే సరిచేసుకోవచ్చు.

అయితే వివరాలు సరిచేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. యూఐడీఏఐ ప్రకారం.. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కోసం 32 రకాల డాక్యుమెంట్లు పని చేస్తాయి. ప్రూఫ్ ఆఫ్ రిలేషన్‌షిప్ కోసం 14 రకాల డాక్యుమెంట్లు పని చేస్తాయి. అలాగే పుట్టిన తేదీ మార్చుకోవడానికి 15 రకాల డాక్యుమెంట్లు పనిచేస్తాయి. వీటిల్లో మీరు ఏ ఒక్క డాక్యుమెంట్ సమర్పించినా సరిపోతుంది.

ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద పాస్‌పోర్ట్, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించవచ్చు. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద పాస్‌పోర్ట్, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, వాటర్ బిల్లు, పాస్‌బుక్, రేషన్ కార్డు, పోస్టాఫీస్ అకౌంట్ స్టేట్‌మెంట్ చెల్లుబాటు అవుతాయి. డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ల కింద బర్త్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్, పాన్ కార్డు, మార్క్ షీట్, ఎస్ఎస్ఎల్‌సీ సర్టిఫికెట్ వంటివి సమర్పించవచ్చు.




