- Telugu News Photo Gallery Business photos Oneplus officially merges with oppo to build better products roll out faster software updates
OnePlus Oppo: ఎలక్ట్రానిక్ దిగ్గజాలు వన్‌ప్లస్, ఒప్పో ఒక్కటయ్యాయి.. మెరుగైన ఉత్పత్తుల కోసం విలీనం
OnePlus Oppo: చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజాలు వన్‌ప్లస్, ఒప్పో ఒక్కటయ్యాయి. చాలాకాలం పాటు రెండు సంస్థలు కలిసి పనిచేసిన తర్వాత విలీన నిర్ణయం తీసుకున్నాయి. మరింత..
Updated on: Jun 18, 2021 | 1:59 PM

OnePlus Oppo: చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజాలు వన్‌ప్లస్, ఒప్పో ఒక్కటయ్యాయి. చాలాకాలం పాటు రెండు సంస్థలు కలిసి పనిచేసిన తర్వాత విలీన నిర్ణయం తీసుకున్నాయి. మరింత మెరుగైన ఉత్పత్తులు తీసుకొచ్చే లక్ష్యంతో రెండు సంస్థలు విలీనమయ్యాయి. దీంతో స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్.. ఒప్పోతో భాగస్వామ్యం ఏర్పర్చుకుంది.

ఇవి రెండూ బీబీకే ఎలక్ట్రానిక్స్ సంస్థలే. అయితే ఈ వివరాలను వన్‌ప్లస్ సీఈఓ పీట్ లా అధికారికంగా ప్రకటించారు. వన్‌ప్లస్ ఇప్పుడు అధికారికంగా ఒప్పోతో విలీనమవుతోంది. ఒప్పోతో భాగస్వామ్యం ద్వారా మెరుగైన ఉత్పత్తులను రూపొందించడానికి, ఇప్పటికే ఉన్న ఉత్పత్తులకు వేగంగా అందించడానికి అవకాశముంటుం పీట్ లా ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు.

ఇండియాతో సహా ఇతర మార్కెట్లలో ఒప్పో ఇటీవలే ‘వన్‌ప్లస్ నార్డ్ సీఈ’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అంతలోనే విలీన నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. వన్‌ప్లస్, ఒప్పో రెండూ తమ ఉత్పత్తి వ్యూహాన్ని పర్యవేక్షించడానికి సంవత్సరం నుంచి కలిసి పనిచేస్తున్నాయి. వన్‌ప్లస్, ఒప్పో రెండూ గ్వాంగ్‌డాంగ్‌కు చెందిన కాంగ్లోమెరేట్ బీబీకే ఎలక్ట్రానిక్స్‌కు చెందినవే. దీనికి వివో, రియల్‌మి వంటి బ్రాండ్లు కూడా ఉన్నాయి.

ఇవన్నీ ఆరంభం నుంచే అంతర్గతంగా వనరులను ఒకదానితో ఒకటి పంచుకుంటున్నాయి. ఒప్పోలో గతంలో పనిచేసిన తన సహచరుడు కార్ల్ పీతో కలిసి 2013లో లా వన్‌ప్లస్‌ను స్థాపించాడు.




