AP Job Calendar Today: నిరుద్యోగులకు శుభ వార్త.. జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి జగన్

AP CM Jagan Job Calendar: ఆంధ్రప్రదేశ్‏లోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమైయ్యారు. నిరుద్యోగ యవకుల ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వశాఖల్లోని...

AP Job Calendar Today: నిరుద్యోగులకు శుభ వార్త.. జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి జగన్
Cm Jagan Job Calendar
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 18, 2021 | 8:01 AM

AP Job Calendar: ఆంధ్రప్రదేశ్‏లోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమైయ్యారు. నిరుద్యోగ యవకుల ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వశాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు అంతా రెడీ చేశారు. ఇప్పటికే ఆయా శాఖల వారిగా ఉన్న ఖాళీల నివేదికను జగన్ ప్రభుత్వం తెప్పించుకున్నారు. దీనికోసం ఉద్యోగాల క్యాలెండర్‌ను సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ శుక్రవారం  (18–06–2021) విడుదల చేయనున్నారు.

ఈ పోస్టులను ఏపీపీఎస్సి ద్వారా భర్తీ చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇవాళ సీఎం జగన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను అవసరాల మేరకు భర్తీ చేయాలని యోచిస్తున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులకు ప్రాధాన్యత ప్రకారం దశలవారిగా ఆర్థిక శాఖ ఆమోదంతో విడుతల వారీగా ఆయా ఖాళీలకు పరీక్షలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అలాగే నూతన విద్యా విధానం గురించి సీఎం జగన్.. రాష్ట్ర మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఇందులో భాగంగా విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఏపీపీఎస్సీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, డియస్సీ తదితర నియామక సంస్ధల ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. అత్యంత పారదర్శకంగా, అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేయనుంది.

ఏపీ ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాల వివరాలు ఇలా ఉన్నాయి…

గ్రామ, వార్డుల వలంటీర్లు(గౌరవ వేతనం): 2,59,565 గ్రామ, వార్డు సచివాలయాల అసిస్టెంట్లు: 1,21,518 వైద్య,ఆరోగ్య కుటుంబసంక్షేమం 13,987 ఆర్‌అండ్‌బి,ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య: 58,388 ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు (ఆప్కాస్‌): 95,212 ఏపీపీఎస్సీ : 2,497 పశుసంవర్ధక, మత్స్యశాఖలు 372 వ్యవసాయ,సహకారశాఖలు 175 ఆహార,పౌరసరఫరాలశాఖ 237 పాఠశాల విద్య : 4,758 ఉన్నత విద్య 1,054 గిరిజన సంక్షేమం : 1,175 సాంఘిక సంక్షేమం : 669 మహిళా,శిశు అభివృద్ధి, వయోజనశాఖ 3500 నైపుణ్యాభివృద్ధి 1,283 విద్యుత్‌శాఖ 8,333 జలవనరులశాఖ : 177 ఇతర శాఖలు : 4,531 ––––––––––––––––––– మొత్తం ఉద్యోగుల సంఖ్య: 5,77,431 –––––––––––––––––––

ఆ విధంగా రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ అన్నీ కలిపి మొత్తం 10,143 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీ నెరవేరుస్తూ దశలవారీగా ఉద్యోగుల భర్తీ రాష్ట్రంలో ఏటా ఉద్యోగాల ఖాళీలు ప్రకటించి, వాటిని భర్తీ చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో మరో ముందడుగు ముందుకు వేస్తోంది.

ఇవి కూడా చదవండి : KTR’s letter to Nirmala Sitharaman : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ