Tipu Sultan: సీఎం జగన్ సొంత జిల్లాలో కొత్త వివాదం.. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై కమలం నేతల ఆందోళన
Controversy on Statue of Tipu Sultan: కడపలోని ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటు వ్యవహారం నానాటికీ వివాదాస్పదమవుతోంది. పట్టణంలో కొందరు ముస్లింలతో కలిసి స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహంపై బీజేపీ మండిపడుతోంది.
సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటు వ్యవహారం నానాటికీ వివాదాస్పదమవుతోంది. పట్టణంలో కొందరు ముస్లింలతో కలిసి స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహంపై బీజేపీ మండిపడుతోంది. ఇప్పటికే కర్నాటకలో టిప్పుసుల్తాన్ జయంతి కార్యక్రమాల్ని వ్యతిరేకిస్తున్న కమలం నేతలు.. ఇప్పుడు జగన్ సొంత జిల్లాలో, అదీ వైసీపీ ఎమ్మెల్యే సాయంతో ఏర్పాటవుతున్న విగ్రహంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఏపీలోనూ టిప్పుసుల్తాన్ ప్రస్తావన మొదలైంది. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న స్ధానికంగా ఉండే ముస్లింలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాలోని ప్రొద్దుటూరులో వైసీపీ నేతల ప్రోత్సాహంతో ఈ విగ్రహం ఏర్పాటు కాబోతోంది. ప్రొద్దుటూరు లోని జిన్నారోడ్డు సర్కిల్లో విగ్రహ ఏర్పాటుకి పూజ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి.
అయితే ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బీజేపీ నేతలు. విగ్రహం ఏర్పాటు చేసే ముందు అతని జీవిత చరిత్రను పూర్తిగా తెలుసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహ స్థానంలో అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
విగ్రహ ఏర్పాటు చేసే ముందు విగ్రహ కమిటీ సభ్యులు పునరాలించుకోవాలని బీజేపీ నేతలు కోరారు. విగ్రహ ఏర్పాటును మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భాగంగా ప్రొద్దుటూరుకు బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి రానున్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు చేసే ప్రాంతాన్నికి వెళ్లనున్న బీజేపీ నేతలు.