Telangana Crime News: ఇంటిపైన‌ నీటి ట్యాంకులో చిన్నారి మృతదేహం.. విచార‌ణ‌లో కంగుతిన్న ఖాకీలు !

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంటిపై ఉన్న నీటి ట్యాంకులో 2 నెలల చిన్నారి మృతదేహం లభ్యమైంది.

Telangana Crime News:  ఇంటిపైన‌ నీటి ట్యాంకులో చిన్నారి మృతదేహం.. విచార‌ణ‌లో కంగుతిన్న ఖాకీలు !
Baby Murder
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 18, 2021 | 11:48 AM

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంటిపై ఉన్న నీటి ట్యాంకులో 2 నెలల చిన్నారి మృతదేహం లభ్యమైంది. రాత్రి తల్లితండ్రులతో కలిసి నిద్రించిన బాలుడు తెల్లారే సరికి నీటి తొట్టిలో శవమై కనిపించాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రంగయ్య కుమార్తె బాలమణి రెండు నెలల క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో రోజు మాదిరిగా గురువారం రాత్రి బాలుడితో పాటు కుటుంబ సభ్యులంతా ఇంట్లో నిద్రించారు. తెల్లవారుజాము నుంచి బాలుడు కనిపించట్లేదని గాలించిన తల్లిదండ్రులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనాజ్‌పూర్‌లో సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా పోలీసులుకు ఎలాంటి ఆచూకి ల‌భించలేదు. దీంతో బాలుడి ఇంటిని పోలీసులు అణువణువునా గాలించారు.  చివరకు ఇంటిపైన వెతకగా నీటి ట్యాంకులో బాలుడి మృతదేహం కనిపించింది.  బాలుడి మృత దేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మేనమామ, అత్తే హత్య చేసుంటారన్న అనుమానంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలే చిన్నారి హత్యకు కారణమని భావిస్తున్నారు. పసికందును హత్య చేసి ట్యాంకులో పడేశారని తెలిపారు. ఘటనాస్థలిని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి పరిశీలించారు.  ప్రస్తుతం ఈ ఘటన స్ధానికంగా కలకలం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఈ చెట్టును నరికితే రక్తం చిందిస్తోంది !.. మ‌రిన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు

అభిమానికి చిరు ఫోన్.. త‌న మ‌న‌సుకు ఎంతో ఆనందంగా ఉంద‌న్న మెగాస్టార్

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?