AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

50 బాంబులకే పాకిస్తాన్ గజ గజ వణికిపోయింది.. ఆపరేషన్ సింధూర్‌పై ఎయిర్ మార్షల్ కీలక కామెంట్స్..

డిఫెన్స్ సమ్మిట్‌లో ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఆపరేషన్ ఎలా జరిగింది..? టార్గెట్స్ ఎలా ఎంచుకున్నారు.? ప్రభుత్వ లక్ష్యం ఏంటీ..? అనే విషయాలను వెల్లడించారు. కొన్ని వీడియోలను సైతం రిలీజ్ చేశారు.

50 బాంబులకే పాకిస్తాన్ గజ గజ వణికిపోయింది.. ఆపరేషన్ సింధూర్‌పై ఎయిర్ మార్షల్ కీలక కామెంట్స్..
Air Marshal Narmadeshwar Tiwari
Krishna S
|

Updated on: Aug 30, 2025 | 5:25 PM

Share

పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ విధ్వంసకర దాడులు చేసింది. ఈ ఆపరేషన్ జరిగిన మూడు నెలల తర్వాత.., భారత వైమానిక దళం ఎయిర్ మార్షల్ నరమదేశ్వర్ తివారీ సంచలన విషయాలు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ యొక్క కొత్త విజువల్స్‌ను ఎన్డీటీవీ డిఫెన్స్ సమ్మిట్‌లో పంచుకున్నారు. ఈ దాడులు కేవలం 50 కన్నా తక్కువ ఆయుధాలను ఉపయోగించి పాకిస్తాన్‌ను కాల్పుల విరమణకు అంగీకరించేలా చేశాయని ఆయన స్పష్టం చేశారు.

యుద్ధాన్ని ముగించడం ముఖ్యం

ఎయిర్ మార్షల్ తివారీ మాట్లాడుతూ.. ‘‘యుద్ధాన్ని ప్రారంభించడం చాలా సులభం, కానీ దానిని ముగించడం చాలా కష్టం. 50 కంటే తక్కువ ఆయుధాలతో మేము సంఘర్షణ నిర్మూలనను సాధించగలి. మేము కేవలం 50 బాంబులతోనే ఈ సమస్యను పరిష్కరించగలిగాము. ఇది మా దళాలు ఎంత సిద్ధంగా ఉన్నాయో చూపిస్తుంది’’ అని అన్నారు. ఈ విజయం వెనుక ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అనే వ్యవస్థ కీలక పాత్ర పోషించదని తెలిపారు. ఈ సిస్టమ్ వల్ల భారత్ వెంటనే స్పందించగలిగిందని, పాకిస్తాన్ ఉద్రిక్తతను తగ్గించడానికి అంగీకరించేలా చేయగలిగిందని ఆయన తెలిపారు.

భారత్ వ్యూహం ఇదే

ప్రభుత్వం ఈ ఆపరేషన్ కోసం మూడు ముఖ్యమైన లక్ష్యాలను పెట్టినట్లు తివారీ తెలిపారు. ప్రతీకార చర్య స్పష్టంగా, గట్టిగా ఉండాలి, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ఒక సందేశం పంపాలి. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, యుద్ధానికి కూడా సిద్ధంగా ఉండాలి.’’ అనే లక్ష్యాలను పెట్టుకుందని తెలిపారు. తమకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యిందని.. అందుకే వేగంగా నిర్ణయాలు తీసుకోగలిగామని తివారీ చెప్పారు.

ఈ దాడుల్లో మురిడ్కే, బహవల్పూర్ లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆయన చెప్పారు. మురిడ్కే అంతర్జాతీయ సరిహద్దు నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది లష్కర్-ఎ-తొయిబా ప్రధాన కార్యాలయం. బహవల్పూర్ సరిహద్దు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జైష్-ఎ-మహ్మద్ ప్రధాన కార్యాలయం. మొత్తంగా ఏడు ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేశామని ఎయిర్ మార్షల్ చెప్పారు. ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా, ప్రతీ లక్ష్యాన్ని చిన్న చిన్న పాయింట్లుగా విభజించి దాడులు చేశామని ఆయన వివరించారు.

మురిడ్కేలో ఉగ్రవాదుల ఆఫీసు భవనం, ఇద్దరు ముఖ్య నాయకుల ఇళ్లపై బాంబులు వేశారు. మొదట డ్రోన్ వీడియోల్లో పైకప్పులకు చిన్న రంధ్రాలు మాత్రమే కనిపించాయి. కానీ లోపల ఉన్న వీడియోలను చూస్తే ఆ భవనాలు పూర్తిగా కూలిపోయాయని తెలిసింది. బహవల్పూర్‌లో ఐదు చోట్ల దాడులు చేశారు. ఆఫీసు భవనాలు, ఉగ్రవాదులు ఉండే క్వార్టర్స్, నాయకుల క్వార్టర్స్‌పై క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడుల వల్ల అక్కడి కమాండ్ సెంటర్లు పూర్తిగా నాశనమయ్యాయి.

నాలుగు రోజుల తీవ్ర దాడుల తర్వా, మే 10న సాయంత్రం 6 గంటల నుండి సైనిక చర్యలను నిలిపివేయడానికి భారత్, పాకిస్తాన్ అంగీకరించాయి. కానీ ఆ తర్వాత కూడా పాకిస్తాన్ డ్రోన్‌లను పంపింది. భారత్ ఈ ఉల్లంఘనలను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పింది.