ఉగ్రవాదుల లాజిస్టిక్స్ నెట్‌వర్క్ కట్.. ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ బాగు ఖాన్ హతం!
జమ్మూ కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌లో భద్రతా దళాలు పెద్ద విజయాన్ని సాధించాయి. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది బాగు ఖాన్ అలియాస్ సమందర్ చాచాను భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌లో హతమార్చాయి. పీఓకేలో నివసిస్తున్న బాగు ఖాన్‌ను ఉగ్రవాద ముఠాలు హ్యూమన్ జీపీఎస్ అని పిలిచేవారు. గత మూడు సంవత్సరాలలో, బాగు ఖాన్ గురెజ్ సెక్టార్‌లోని వివిధ ప్రాంతాల నుండి 100 కి పైగా చొరబాట్లకు పాల్పడ్డాడు.

జమ్మూ కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌లో భద్రతా దళాలు పెద్ద విజయాన్ని సాధించాయి. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది బాగు ఖాన్ అలియాస్ సమందర్ చాచాను భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌లో హతమార్చాయి. పీఓకేలో నివసిస్తున్న బాగు ఖాన్‌ను ఉగ్రవాద ముఠాలు హ్యూమన్ జీపీఎస్ అని పిలిచేవారు .
గత మూడు సంవత్సరాలలో, బాగు ఖాన్ గురెజ్ సెక్టార్‌లోని వివిధ ప్రాంతాల నుండి 100 కి పైగా చొరబాట్లకు పాల్పడ్డాడు. ఈ ప్రాంతం రహస్య మార్గాల గురించి, అనుకూల, ప్రతికూల పరిస్థితుల్లో ఏమి చేయాలో అతనికి పూర్తి జ్ఞానం ఉంది. అందుకే అతను అన్ని ఉగ్రవాద గ్రూపులకు ముఖ్యుడిగా భావిస్తుంటారు. హిజ్బుల్ కమాండర్‌గా ఉన్నప్పుడు , గురెజ్, నియంత్రణ రేఖలోని పొరుగు ప్రాంతాల నుండి చొరబాట్లను ప్లాన్ చేయడంలో, అమలు చేయడంలో బాగు ఖాన్ దిట్ట. భారత్‌లోకి చొరబడే ఉగ్రవాద సంస్థలకు సహాయం చేశాడని భద్రతా దళాలు తెలిపాయి.
సంవత్సరాల తరబడి భద్రతా దళాల నుండి తప్పించుకున్న తర్వాత, బండిపోరాలోకి చొరబడటానికి ప్రయత్నించిన ఉగ్రవాది బాగు ఖాన్‌ను సైన్యం హతమార్చింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మరో ఉగ్రవాది హతమయ్యాడు. బాగు ఖాన్‌ను నిర్మూలించడం ఈ ప్రాంతంలోని ఉగ్రవాద సంస్థల లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌కు పెద్ద దెబ్బ. రెండు రోజుల క్రితం భారత సైన్యం ఈ ఆపరేషన్ నిర్వహించింది.
గురువారం ( ఆగస్టు 28) జమ్మూ కాశ్మీర్‌లోని బండిపుర జిల్లాలోని గురేజ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ ( ఎల్‌ఓసి ) వద్ద చొరబడటానికి ప్రయత్నిస్తున్న బాగు ఖాన్‌ను భద్రతా దళాలు కనుగొన్నాయి. నిఘా సమాచారం ఆధారంగా, భద్రతా దళాలు ఇక్కడ ఉగ్రవాదుల కోసం వెతకడానికి ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సమయంలో బాగు ఖాన్‌తో పాటు మరో ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి. మరుసటి రోజు ఆగస్టు 29 ఉదయం వరకు ఆ ప్రాంతంలో కాల్పులు, సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. “అప్రమత్తమైన దళాలు అనుమానాస్పద కదలికలను గమనించి చొరబాటుదారులను అడ్డుకున్నాయి. దీనితో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దళాలు ప్రతిదాడి చేసి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి” అని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




