AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దేవుడా.. హార్ట్ ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు.. సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం..!

అది ఓ హృదయవిదారక ఘటన. భారతదేశపు యువ ప్రాణరక్షకులలో ఒకడు తాను చికిత్స చేసే వ్యాధికే ప్రాణాలు కోల్పోయాడు. అదికూడా రోగులకు చికిత్స అందిస్తుండగానే కుప్పకూలిపోయాడు. డాక్టర్ గ్రేడ్లిన్ రాయ్ అనే 39 ఏళ్ల కార్డియాక్ సర్జన్ వార్డు రౌండ్ల సమయంలో కుప్పకూలిపోయాడు. అతనికి సహోద్యోగులు సీపీఆర్, స్టెంటింగ్, ఇంట్రా-అయోర్టిక్ బెలూన్ పంప్, ఎక్మో వంటివి ఎంత తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.

అయ్యో దేవుడా.. హార్ట్ ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు.. సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం..!
Chennai Cardiac Surgeon Dies
Balaraju Goud
|

Updated on: Aug 30, 2025 | 9:48 PM

Share

అది ఓ హృదయవిదారక ఘటన. భారతదేశపు యువ ప్రాణరక్షకులలో ఒకడు తాను చికిత్స చేసే వ్యాధికే ప్రాణాలు కోల్పోయాడు. అదికూడా రోగులకు చికిత్స అందిస్తుండగానే కుప్పకూలిపోయాడు. డాక్టర్ గ్రేడ్లిన్ రాయ్ అనే 39 ఏళ్ల కార్డియాక్ సర్జన్ వార్డు రౌండ్ల సమయంలో కుప్పకూలిపోయాడు. అతనికి సహోద్యోగులు సీపీఆర్, స్టెంటింగ్, ఇంట్రా-అయోర్టిక్ బెలూన్ పంప్, ఎక్మో వంటివి ఎంత తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, పూర్తి ధమనుల అవరోధం వల్ల గుండెపోటు నుండి జరిగిన నష్టాన్ని ఏదీ భర్తీ చేయలేకపోయింది. ఆయన ఆకస్మిక మరణం వైద్య వర్గాలను కుదిపేయడంతో పాటు సీనియర్ వైద్యుల నుంచి అత్యవసర హెచ్చరికలు వెల్లువెత్తాయి.

చెన్నైలో గుండె జబ్బులకు చికిత్స చేస్తున్న 39 ఏళ్ల కార్డియాక్ సర్జన్ గుండెపోటుతో మరణించారు. ఆసుపత్రిలో విధుల్లో ఉండగా ఆయన మరణించారు. ఆసుపత్రిలోని ఇతర వైద్యులు ఆయనను కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన చెన్నైలోని సవిత మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది. 39 ఏళ్ల డాక్టర్ గ్రేడ్లిన్ రాయ్ కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. బుధవారం (ఆగస్టు 27) గుండెపోటుతో మరణించారు. డాక్టర్ రాయ్‌ను కాపాడటానికి అన్ని ప్రయత్నాలు జరిగాయి. డాక్టర్ రాయ్ కు CPR, స్టెంటింగ్ తో యాంజియోప్లాస్టీ, ఇంట్రా-అయోర్టిక్ బెలూన్ పంప్, ECMO కూడా ఇచ్చారు. కానీ ఆయనను కాపాడలేకపోయారు. ఆయన గుండెలోని ఎడమ ప్రధాన ధమని 100 శాతం మూసుకుపోయింది. దాని వల్ల ఆయన మరణించారని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X వేదికగా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ రాశారు.

డాక్టర్ రాయ్ గుండెపోటుతో మరణించడం మొదటి కేసు కాదు. 30-40 సంవత్సరాల వయస్సు గల వైద్యులలో ఇది చాలా సాధారణం అయిపోయింది. దీనికి ప్రధాన కారణం పని గంటల ఒత్తిడి. వైద్యులు 12-18 గంటలు, కొన్నిసార్లు 24 గంటలు పని చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు, ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, శారీరక వ్యాయామం చేయకపోవడం, ఆరోగ్య తనిఖీలను విస్మరించడం, సమయం లేకుండా ఆహారం తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల ప్రజలు వేగంగా నిరాశ, ఆందోళనకు గురవుతున్నారని డాక్టర్ సుధీర్ తెలిపారు.

అయితే చాలా అరుదుగా సహాయం కోరతారు. విడ్డూరంగా, ఇతరులను రక్షించడంలో, చాలా మంది తమ స్వంత నివారణ సంరక్షణను చాలా వరకు ఆలసత్వం, నిర్లక్ష్యం చేస్తారు. డాక్టర్ కుమార్ హెచ్చరిక కేవలం రోగ నిర్ధారణ మాత్రమే కాదు. ఇది మనుగడకు ప్రిస్క్రిప్షన్ కూడా. రోగుల కోసం రిజర్వ్ చేసిన అదే తీవ్రతతో వారి స్వంత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్ సుధీర్ వైద్యులను కోరారు. రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ కోసం క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేసుకోవాలన్నారు. ఏడు గంటల నిద్రను కాపాడుకోవడం చాలా అవసరం. రోజూ కేవలం 30 నిమిషాల బ్రిస్క్ వాకింగ్ లేదా సైక్లింగ్ చేస్తే ఫలితం ఉంటుందన్నారు. సమతుల్య ఆహారం, యోగా లేదా ధ్యానం వంటి ఒత్తిడి నిర్వహణ పద్ధతులు, వర్న్అవుట్ చేయాలని సూచించారు.

ఇదిలావుంటే, గుజరాత్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌరవ్ గాంధీ (41) 2023లో గుండెపోటుతో కన్నుమూశారు. తన కెరీర్లో 16,000 గుండె శస్త్రచికిత్సలు చేశారు. అయితే, ఆయన ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే బాత్రూమ్ వద్ద కుప్పకూలిపోయారు. అత్యవసరంగా కుటుంబసభ్యులు జీజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 45 నిమిషాల్లోనే మరణించారని జామ్నగర్లోని ఎంపీ షా మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ నందిని దేశాయ్ తెలిపారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై