‘సైడ్ షో నాకు ఇష్టం లేదు’ అమికస్ క్యూరీగా సుప్రీంకోర్టు కేసునుంచి తప్పుకున్న సీనియర్ లాయర్ హరీష్ సాల్వే

దేశంలో ఆక్సిజన్ కొరత, వ్యాక్సిన్లు, మందుల కొరతకు సంబంధించి సుప్రీంకోర్టు తనకు తానుగా చేబట్టిన కేసు నుంచి సీనియర్ లాయర్ హరీష్ సాల్వే తప్పుకున్నారు.

  • Umakanth Rao
  • Publish Date - 6:04 pm, Fri, 23 April 21
'సైడ్ షో నాకు ఇష్టం లేదు' అమికస్ క్యూరీగా సుప్రీంకోర్టు కేసునుంచి తప్పుకున్న సీనియర్ లాయర్ హరీష్ సాల్వే
Harish Salve

దేశంలో ఆక్సిజన్ కొరత, వ్యాక్సిన్లు, మందుల కొరతకు సంబంధించి సుప్రీంకోర్టు తనకు తానుగా చేబట్టిన కేసు నుంచి సీనియర్ లాయర్ హరీష్ సాల్వే తప్పుకున్నారు. ఆయన నిర్ణయాన్ని కోర్టు అంగీకరించింది. అమికస్ క్యూరీ (సహాయకుడి) గా తన నియామకాన్ని కొంతమంది న్యాయవాదులు విమర్శించడం పట్ల సాల్వే అసంతృప్తిని వ్యక్తం చేశారు. చీఫ్ జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే తనకు తెలిసి ఉన్నందునే తనను ఈ పదవిలో నియమించారన్న విమర్శ తనను బాధించిందని, ఈ కారణం కింద కేసును నిర్ణయించే ప్రయత్నం జరుగుతోందనడంతో తానూ మనస్థాపం చెందానని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాబ్డే శుక్రవారం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అమికస్ క్యూరీగా కోర్టు సాల్వేను నియమిస్తూ నిన్న ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నియామకంపై కొందరు సీనియర్ లాయర్లు విమర్శలు చేశారు. (దేశంలో కోవిడ్ 19 పరిస్థితికి సంబంధించి కేసుల విచారణ నుంచి హైకోర్టులను ఆపాలని తాము ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని  కోర్టు ధర్మాసనం పేర్కొంది). సాల్వే ఆదేశాల విషయంలో తాము  జారీ చేసిన ఆదేశాలను చదవకుండా మాకు దురుద్దేశాలను ఆపాదించారు అని గుజరాత్ బార్ అసోసియేషన్ తరఫు న్యాయవాది దుశ్యంత్ దవేని ఉద్దేశించి బాబ్డే నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది.సాల్వే నియామకం అందరు జడ్జీల ఆమోదంపై తీసుకున్న నిర్ణయమని బెంచ్ స్పష్టం చేసింది. ఇది న్యాయమూర్తులందరి  ఉమ్మడి నిర్ణయమని పేర్కొంది.

కాగా ఇది సెన్సిటివ్ మ్యాటర్ అని, స్కూలు, కాలేజీ రోజుల నుంచే తనకు బాబ్డే తెలుసునన్న కారణంతోనే తనను ఈ పదవిలో నియమించారన్న విమర్శలు తనకు మనస్థాపం కలిగించాయని చెప్పిన హరీష్ సాల్వే.. తనకు  ఎలాంటి సైడ్ షోలు ఇష్టం లేవని వ్యాఖ్యానించారు.అటు-కేసునుంచి ఉపసంహరించుకోరాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా..హరీష్ సాల్వేని కోరారు. ఇలాంటి ఒత్తిడులకు లొంగరాదని అభ్యర్థించారు. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టులో సీజేఐ గా తనకిది చివరి రోజని, ఎన్నో మంచి కేసుల విచారణ జరగడం తనకు సంతృప్తి నిచ్చిందని ఎస్.ఏ. బాబ్డే అన్నారు. తనకు సహకరించిన జడ్జీలు, సీనియర్  లాయర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Free food grains : కరోనా నేపథ్యంలో దేశంలోని 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయబోతోన్న మోదీ సర్కారు

Terrific: అమ్మో..అమ్మనే చంపుకు తినేశాడు..కుక్కతోనూ తినిపించాడు..దారుణాతి దారుణం!