Terrific: అమ్మో..అమ్మనే చంపుకు తినేశాడు..కుక్కతోనూ తినిపించాడు..దారుణాతి దారుణం!
ఒక్కో సంఘటన గురించి చెప్పుకోవడానికీ.. వినడానికీ చాలా భయం వేస్తుంది. అసలు ఆ ఘటనకు పాల్పడిన వారిని తలచుకుంటేనే గొంతు తడి ఆరిపోతుంది. దారుణం అనే పదం కూడా ఈ ఘోరాన్ని చెప్పడానికి భయపడిపోతుంది.
Terrific: ఒక్కో సంఘటన గురించి చెప్పుకోవడానికీ.. వినడానికీ చాలా భయం వేస్తుంది. అసలు ఆ ఘటనకు పాల్పడిన వారిని తలచుకుంటేనే గొంతు తడి ఆరిపోతుంది. దారుణం అనే పదం కూడా ఈ ఘోరాన్ని చెప్పడానికి భయపడిపోతుంది. ఇదంతా స్పెయిన్ లో ఓ యువకుడు చేసిన అఘాయిత్యం గురించి. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఆ యువకుడు ఏం చేశాడంటే.. తన తల్లిని చంపేసి.. ముక్కలు చేసి.. తను తిన్నాడు.. కుక్కకు పెట్టాడు.. కొంత భాగాన్ని ఫ్రిజ్ లో దాచాడు. కలికాలం అంటే ఇదే కావచ్చు.
స్పెయిన్ లోని మాడ్రిడ్ కు చెందిన అల్బెర్టో శాంచేజ్ వెయిటర్ గా పనిచేశాడు. అతను తన తల్లి మరియా సోలెడాడ్ గోమెజ్ (68)తో కలసి నివసిస్తుండేవాడు. ఒకరోజు తన తల్లితో ఘర్షణ పడిన ఆ యువకుడు కోపంలో ఆమెను గొంతు కోసి చంపేశాడు. తరువాత ఆమె శరీరాన్ని ముక్కలుగా దాదాపు వెయ్యి ముక్కలుగా చేసి ఫ్రిజ్ లోనూ, కంటైనర్లలో ఉంచి ఇంటికి చుట్టుపక్కల గోతుల్లోనూ ఉంచాడు. కొంత భాగాన్ని అతను తినేశాడు. తన పెంపుడు కుక్కకూ ఆ మాంసం పెట్టాడు. చనిపోయిన ఆమె స్నేహితుడు ఒకరు ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మహిళ ఆచూకీ కోసం ఆ ఇంటికి వెళ్ళిన పోలీసులకు షాక్ తగిలింది. ఫ్రిజ్ లో ఆ మహిళ మృతదేహం ముక్కలుగా కనిపించింది. దీంతో అల్బెర్టో శాంచేజ్ ను అరెస్ట్ చేసి విచారించారు.
విచారణలో తన తల్లిని తానే చంపెశాననీ.. ముక్కలుగా చేసి తిన్నాననీ చెప్పాడు. దీంతో పోలీసులు విస్తుపోయారు. అంతేకాకుండా కోర్టులో కూడా ఆ యువకుడు తన నేరాన్ని అంగీకరించాడు. కానీ, తాను టీవీ చూస్తున్న సమయంలో తన తల్లిని చంపమని తన ఇంటి చుట్టు పక్కల వారు గట్టిగా అరచి చెప్పినట్టు వినబదిందనీ అందుకే చంపేసాననీ చెప్పాడు. అయితే, ఆమెను ముక్కలుగా నరకడం.. తినడం తనకు గుర్తులేదని తెలిపాడు. దీంతో కోర్టు అతని మానసిక స్థితిపై పరిశీలన జరపమని ఆదేశించింది. దీంతో అల్బెర్టోకు మానసిక పరీక్షలు కూడా జరిపారు. అయితే, ఇంకా వాటి ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.
Also Read: Murder: అస్సాంలో దారుణం.. ఇంటికి వెళతానన్నందుకు.. బాలికను కడతేర్చిన యజమానులు.. నిప్పంటించి..
Vaccination: టీకాతో ఆ దేశాల్లో ఆగిన కరోనా కల్లోలం..వ్యాక్సిన్ ప్రభావం ఆ ఆరు దేశాల్లో ఎలా పనిచేసింది?