AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murder: అస్సాంలో దారుణం.. ఇంటికి వెళతానన్నందుకు.. బాలికను కడతేర్చిన యజమానులు.. నిప్పంటించి..

12 yr old girl murder: అస్సాంలోని నాగావ్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లో సహాయకురాలిగా ఉన్న 12 ఏళ్ల బాలికను ఇంటి యజమానులే కడతేర్చారు. తన ఇంటికి

Murder: అస్సాంలో దారుణం.. ఇంటికి వెళతానన్నందుకు.. బాలికను కడతేర్చిన యజమానులు.. నిప్పంటించి..
burn
Shaik Madar Saheb
|

Updated on: Apr 23, 2021 | 5:41 PM

Share

12 yr old girl murder: అస్సాంలోని నాగావ్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లో సహాయకురాలిగా ఉన్న 12 ఏళ్ల బాలికను ఇంటి యజమానులే కడతేర్చారు. తన ఇంటికి బాలిక వెళ్తాననడంతో యజమానులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇంటి యజమానులను అరెస్టు చేశారు. వివరాలు.. నాగావ్ జిల్లాలోని ఓ ఇంట్లో 12 ఏళ్ల బాలిక ఐదేళ్ల నుంచి అక్కడే ఉంటూ సహాయకురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమె ఇంటికి వెళతానని.. అనుమతించాలని యజమానులను కోరింది. ఒప్పుకోని యజమానులు ఆ బాలికను చిత్రహింసకు గురిచేసి కిరోసిన్ పోసి నిప్పటించారు. ఆతర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించారు. ముందుగా బాలిక అనుమానాస్పదంగా మృతిచెందినట్లు పోలీసులు కేసునమోదు చేశారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి.

12ఏళ్ల బాలికను ఇంటి యజమానులే చంపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చి ఇంటి యజమాని ప్రకాష్ బోర్తాకుర్, అతని కుమారుడు నయన్మోని బోర్తాకుర్‌ను అరెస్టు చేసినట్లు నాగావ్ సూపరింటెండెంట్ గౌరవ్ అభిజిత్ దిలీప్ తెలిపారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపినట్లు పోలీసులు తెలిపారు. 14 ఏళ్లలోపు పిల్లలను పనికోసం నియమించడం నిషేధమని.. ఇది చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఎస్పీ తెలిపారు. ఆమె ఇంటికి వెళ్లేందుకు అనుమతించమని కోరిన తరువాత యజమానులు కిరోసిన్ పోసి నిప్పటించినట్లు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. దర్యాప్తు అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Also Read:

Young man Murder: ప్రేమ పెళ్లికి పెద్దలు అడ్డుపడ్డారు.. ప్రేయసిని తీసుకుని ఎటైనా వెళ్లిపోవాలనుకున్నాడు.. అంతలోనే విషాదం..!

Suicide: కరోనాతో కుటుంబసభ్యులు మరణించారని.. ఇద్దరు మహిళల బలవన్మరణం..