Suicide: కరోనాతో కుటుంబసభ్యులు మరణించారని.. ఇద్దరు మహిళల బలవన్మరణం..
COVID-19: కరోనా మహమ్మారి నిత్యం వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. దీంతో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఈ క్రమంలోనే తమ కుటుంబసభ్యుల
COVID-19: కరోనా మహమ్మారి నిత్యం వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. దీంతో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఈ క్రమంలోనే తమ కుటుంబసభ్యులను కరోనా కబళించిందని మనస్థాపం చెందిన ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా మహమ్మారితో తన తల్లి చనిపోయిందని ఒకరు.. దీంతోపాటు కుటుంబంలో ముగ్గురు మరణించారని మనస్థాపానికి గురైన మరొక మహిళ తనువుచాలించారు. ఈ రెండు వేర్వేరు సంఘటనలు మధ్యప్రదేశ్‌లో జరిగాయి. తల్లి మృతిని తట్టుకోలేక ఎంపీలోని రైసన్ జిల్లాలోని ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లో బుధవారం యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తల్లి రెండు రోజులక్రితం కరోనాతో మరణించింది. అనంతరం యువతి తీవ్ర మనస్థాపానికి గురై బుధవారం నాలుగో అంతస్తు నుంచి దూకింది. ఈ క్రమంలో తండ్రి చాలాసేపు యువతిని పట్టుకున్నాడు. చాలా మంది కూడా యువతిని రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఆ యువతి బిల్డింగ్‌పై నుంచి దూకింది. అనంతరం తీవ్రంగా గాయపడిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ అమృత్ మీనా తెలిపారు.
ఇదిలాఉంటే.. దేవాస్‌లో కరోనాతో ఓ కుటుంబంలోని ముగ్గురు సభ్యులు మరణించారు. ఇది తట్టుకోలేని వివాహిత బుధవారం ఆత్మహత్య చేసుకుంది. దేవాస్‌లోని బాల్కిషన్ గార్గ్ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. వారంలోనే కరోనాతో మరణించారు. అత్త, మామ, భర్త చనిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహిళ బుధవారం ఉరి వేసుకొని చనిపోయింది. అయితే వారంతా కోవిడ్‌తోనే మరణించారా లేక వేరే కారణాలతో మరణించారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.