Young man Murder: ప్రేమ పెళ్లికి పెద్దలు అడ్డుపడ్డారు.. ప్రేయసిని తీసుకుని ఎటైనా వెళ్లిపోవాలనుకున్నాడు.. అంతలోనే విషాదం..!
యువకుడి రాకను గమనించిన బాలిక కుటుంబ సభ్యులు.. ఆ కుర్రాడిని పట్టుకుని చితకబాదారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లాలో ఈ దారుణం జరిగింది.
Young man died :ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు.. గాఢంగా ప్రేమించుకున్నారు. తమ ప్రేమకు పెద్దలు అడ్డొచ్చారనీ, ప్రేమ పెళ్లికి కూడా ఒప్పుకోరని ఆ యువకుడు అభిప్రాయానికి వచ్చేశాడు. ప్రేయసిని తీసుకుని ఎటైనా వెళ్లిపోవాలనుకున్నాడు. కానీ, ఇంతలోనే ఊహించని ఘటన ఎదురైంది.. అతడి రాకను గమనించిన బాలిక కుటుంబ సభ్యులు.. ఆ కుర్రాడిని పట్టుకుని చితకబాదారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. అనంతపురం నగరశివారులోని చంద్రబాబునాయుడి కొట్టాలకు చెందిన అంకె సూర్యప్రకాశ్ అనే యువకుడు ఐటీఐ పూర్తి చేశాడు. అతడు ఉండే కాలనీకే చెందిన ఓ బాలిక ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆ బాలిక, సూర్యప్రకాశ్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ ఇంతలోనే వారి వ్యవహారం బాలిక ఇంట్లో తెలిసింది. దీంతో ఆ బాలికను తీవ్రంగా మందలించారు. తమ కూతురిని మళ్లీ కలవద్దనీ, మాట్లాడవద్దని ఆ యువకుడిని గట్టిగా హెచ్చరించారు.
దీంతో తమ ప్రేమకు పెద్దలు అడ్డొచ్చారనీ, ప్రేమ పెళ్లికి కూడా ఒప్పుకోరని ఆ యువకుడు అభిప్రాయానికి వచ్చేశాడు. ప్రేయసిని తీసుకుని ఎటైనా వెళ్లిపోవాలనుకున్నాడు. అంతే, అర్ధరాత్రి బాలిక ఇంటికి వెళ్లాడు. ఆ బాలికను తనతో తీసుకెళ్లిపోదామనుకున్నాడు. ఎటైనా వెళ్లిపోయి పెళ్లి చేసుకుని కాపురం పెట్టాలని నిర్ణయించుకున్నారు. దానికి ప్రేయసి కూడా సరేననడంతో ప్లాన్ ఫిక్స్ చేసుకున్నారు.
ఏప్రిల్ 19వ తేదీ అర్ధరాత్రి సమయంలో బాలికను తీసుకెళ్లేందుకు ఆమె ఇంటి వద్దకు సూర్యప్రకాశ్ వచ్చాడు. ఈ విషయాన్ని ముందే గ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు అతడి రాకను గుర్తించారు. వెంటనే అతడిని పట్టుకుని కర్రలతో చితకబాదారు. స్థానికులు వారిని అడ్డుకుని తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి సూర్యప్రకాశ్ మరణించాడు.
కాగా ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరంఅతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. యువకుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాలిక తల్లిదండ్రులు, సమీప బంధువులపై కేసు నమోదు చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.