సీఎంలతో మోదీ కాన్ఫరెన్స్ ను అరవింద్ కేజ్రీవాల్ అలా వాడుకున్నారు, కేంద్రం ఫైర్ దేశంలో

దేశంలో కోవిడ్ పరిస్థితిపై 11 రాష్ట్రాల  ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన కాన్ఫరెన్స్ ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకున్నారని కేంద్ర వర్గాలు ఆరోపించాయి.

సీఎంలతో మోదీ కాన్ఫరెన్స్ ను అరవింద్ కేజ్రీవాల్ అలా వాడుకున్నారు, కేంద్రం ఫైర్ దేశంలో
Arvind Kejriwal Used Pm's Conference
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Apr 23, 2021 | 6:56 PM

దేశంలో కోవిడ్ పరిస్థితిపై 11 రాష్ట్రాల  ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన కాన్ఫరెన్స్ ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకున్నారని కేంద్ర వర్గాలు ఆరోపించాయి. ఆక్సిజన్ కొరతపై ప్రధాని మాట్లాడుతుండగా మధ్యలో ఆయన కల్పించుకుని.. ఈ నగరంలో ఆక్సిజన్ ప్లాంట్ లేకపోతే ఇక్కడి ప్రజలు దాన్ని పొందలేరా అని ప్రశ్నించారని, అసలు ఆయన వ్యాఖ్యలు సమస్య పరిష్కారానికి కాక.. బాధ్యతనుంచి తప్పించుకునేలా ఉన్నాయని ఈ వర్గాలు విమర్శించాయి. కేంద్రం తన వద్ద ఒక్క వ్యాక్సిన్ డోసు కూడా ఉంచుకోదని, రాష్ట్రాలతో షేర్  చేసుకుంటుందని తెలిసినప్పటికీ ఆయన వ్యాక్సిన్ ధరలపై అబధ్ధాలు వ్యాప్తి చెందింపజేయడానికి  ఈ సందర్భాన్ని వినియోగించుకున్నారని ఈ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విమానాల ద్వారా టీకామందులు సప్లయ్ చేయాలని  కేజ్రీవాల్ కోరారని, కానీ ఈ ప్రక్రియ అప్పుడే ప్రారంభమైందన్న విషయం ఆయనకు తెలియదని ఎద్దేవా చేశాయి. అరవింద్  కేజ్రీవాల్ చాలా దిగజారిపోయారని, ఈ సమావేశంలో ఆయన వ్యాఖ్యలు పూర్తిగా తన రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకునేలా ఉన్నాయనడంలో సందేహం లేదని కేంద్రం దుయ్యబట్టింది.

దేశంలో ఆక్సిజన్ కొరతపై ప్రధాని మోదీ శుక్రవారం 11  రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చ్యువల్ గా మాట్లాడారు. అయితే కేజ్రీవాల్, మోదీ డిస్కషన్ టీవీలో కొద్దిసేపు లైవ్ గా సాగింది. ఇలా ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నప్పుడు ‘ఇన్-హౌస్ మీటింగ్’ తగదని మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఇందుకు విచారిస్తున్నానని కేజ్రీవాల్ అంటూనే..ఆక్సిజన్ కొరత వల్ల ఢిల్లీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యను వివరించారు. ఈ నగరానికి  ఆక్సిజన్ ట్యాంకర్లు రాకుండా ఆపివేస్తున్నారని, దీని కొరత వల్ల పెద్ద ట్రాజెడీ సంభవిస్తుందని ఆయన అన్నారు. ఏమైనా.. ఆయన వ్యాఖ్యలపట్ల కేంద్రం అభ్యంతరం ప్రకటించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Shanaya Katwe : మేనేజర్ తో కామకేళి.. అడ్డొస్తున్నాడని సొంత తమ్ముడ్నే హతమార్చిన కేసులో హీరోయిన్ అరెస్ట్

Sonu Sood: కరోనాతో బాధపడుతున్న యువతిని నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తరలించిన ‘రియల్ హీరో సోనూసూద్‌’