Uttam Letter : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ .. ఎందుకంటే.. ?
Uttam Letter : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాశారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ర్టంలో ఎన్నికలు నిర్వహిస్తే ఎదురయ్యే సమస్యలపై ఆయన గవర్నర్ కు తన లేఖ ద్వారా వివరించారు.
Uttam kumar reddy letter to Telangana Governor : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాశారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ర్టంలో ఎన్నికలు నిర్వహిస్తే ఎదురయ్యే సమస్యలపై ఆయన గవర్నర్ కు తన లేఖ ద్వారా వివరించారు. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత అధికంగా ఉందని.. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయం మేరకే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తలొగ్గిన్నట్లు ఉత్తమ్ ఆ లేఖలో ఆరోపించారు. ఈ గడ్డు పరిస్థితుల్లో గవర్నర్‌గా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందు అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించే పద్ధతిని ఎస్‌ఈసీ మర్చిపోయిందని ఉత్తమ్ ఈ సందర్భంగా విమర్శించారు. కొవిడ్ సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతుంటే, ఈ నెల 15న మినీ పుర ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడం తొందరపాటు చర్య అని ఆయన అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ప్రతికూల ఫలితం వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ భావించిందని.. ఆ ప్రభావం పుర ఎన్నికలపై పడకుండా ఉండేందుకు తీసుకున్న రాజకీయ ఆదేశాలను ఎస్‌ఈసీ అనుసరించిందని ఆయన ఎద్దేవా చేశారు. కాగా, వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలకు.. సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఈ నెల 30న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
మరిన్ని ఎక్కడ చూడండి: Covid Deaths : విశాఖలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం.. స్మశాన వాటికల్లో రాత్రనకా, పగలనకా కాలుతోన్న చితి మంటలు