Sangam Dairy : సంగం డైరీ చైర్మన్‌గా ధూళిపాళ్ల నరేంద్ర అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు : ఏసీబీ
Sangam Dairy: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై ఏసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. సంగం డెయిరీ ఆధ్వర్యంలో అనేక ఆర్థిక పాలనా పరమైన అవకతవకలు జరిగాయని ఏసీబీ పేర్కొంది.
Dhulipalla Narendra : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై ఏసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. సంగం డెయిరీ ఆధ్వర్యంలో అనేక ఆర్థిక పాలనా పరమైన అవకతవకలు జరిగాయని ఏసీబీ పేర్కొంది. ఇతరుల సహకారంతో చైర్మన్ నరేంద్ర అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ తెలిపింది. తీవ్రమైన నేరం కావడం వల్ల ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లభించాయని ఏసీబీ వెల్లడించింది. సంగం డైరీ చైర్మన్‌గా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేశారని ఏసీబీ స్పష్టం చేసింది. డైరీని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారని పేర్కొంది. ఈ కేసులో డెయిరీ చైర్మన్ నరేంద్రకుమార్ ఏ1, ఏ2 డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్, ఏ3గా ఎం. గురునాథం ఉన్నారని ఏసీబీ వెల్లడించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Indonesia submarine: ఇండోనేషియా జలాంతర్గామి కోసం ఆగని వెతుకులాట..అందులో ఆక్సిజన్ అయిపోతుందేమో అనే టెన్షన్..
Salman Khan: సౌత్ సినిమా సౌంగ్స్ పైన మోజుపడుతున్న సల్మాన్ ఖాన్.. రాధే మూవీలో ఆ పాట..