Indonesia submarine: ఇండోనేషియా జలాంతర్గామి కోసం ఆగని వెతుకులాట..అందులో ఆక్సిజన్ అయిపోతుందేమో అనే టెన్షన్..

టార్పెడో డ్రిల్ సమయంలో బుధవారం బాలి సముద్రంలో మిస్ అయిపోయిన KRI నంగల -402 సబ్ మెరైన్ కోసం ఎడతెరిపి లేకుండా వెతుకులాట సాగుతోంది.

Indonesia submarine: ఇండోనేషియా జలాంతర్గామి కోసం ఆగని వెతుకులాట..అందులో ఆక్సిజన్ అయిపోతుందేమో అనే టెన్షన్..
Indonesia Submarine
Follow us
KVD Varma

|

Updated on: Apr 23, 2021 | 9:31 PM

Indonesia submarine: టార్పెడో డ్రిల్ సమయంలో బుధవారం బాలి సముద్రంలో మిస్ అయిపోయిన KRI -402 సబ్ మెరైన్ కోసం ఎడతెరిపి లేకుండా వెతుకులాట సాగుతోంది. మరిన్ని నావికాదళ నౌకలు శుక్రవారం తెల్లవారుజామున ఇండోనేషియా బన్యువాంగి నుండి ఈ పనిమీద బయలుదేరాయి. అందులో చిక్కుకునిపోయిన “53 మంది సిబ్బంది సభ్యుల భద్రత ప్రధాన ప్రాధాన్యత” అని అధ్యక్షుడు జోకో విడోడో గురువారం ఆలస్యంగా చెప్పారు అలాగే ఈ నౌకను కనుగొనటానికి అన్ని ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు. అయితే, ఈ జలాంతర్గామిలో ఆక్సిజన్ నిలువలు శనివారం వరకూ మాత్రమె ఉంటాయని అధికారులు చెపుతుండటంతొ మరింత టెన్షన్ మొదలైంది. ఆ లోగా దానిని కనుక్కోలేకపోతే, తరువాత ఇబ్బంది ఎదురైనట్లే అని అధికారులు చెబుతున్నారు. “వారు కనుగొనబడటానికి ముందు, ఆక్సిజన్ సరిపోతుంది” అని నేవీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ యుడో మార్గోనో ఒక వార్తా సమావేశంలో ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు జరిగిన వెతుకులాటలో ఇతమిత్థంగా ఏదీ తెలియకపోయినా, యుడో 50-100 మీటర్ల (164-328 అడుగులు) లోతులో “అధిక అయస్కాంత శక్తి” ఉన్న ఒక వస్తువును గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ వస్తువు ఆగి ఉన్న జలాన్తర్గామా లేక సముద్రపు అడుగుభాగంలో ఉందా అనేది అస్పష్టంగా ఉంది. డీజిల్-ఎలక్ట్రిక్ శక్తితో పనిచేసే జలాంతర్గామి 500 మీటర్ల లోతును తట్టుకోగలదు కాని అంతకంటే ఎక్కువ ఏదైనా అయితే, అది ప్రాణాంతకం కావచ్చు అని నేవీ ప్రతినిధి ఒకరు తెలిపారు. బాలి సముద్రం 1,500 మీటర్ల కంటే ఎక్కువ లోతు ఉంటుంది. ఈ నేపధ్యంలో సముద్రంలో మట్టానికి జలాంతర్గామి చేరుకుంతో కష్టం అనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

ఒక వైమానిక శోధన జలాంతర్గామి యొక్క మిస్ అయిన ప్రదేశానికి సమీపంలో చమురు చిందటం కూడా గుర్తించింది, ఇది నౌకాదళం ఓడకు నష్టాన్ని సూచిక కావచ్చు లేదా సిబ్బంది నుండి తాము ప్రమాదంలో ఉన్నామన్న సిగ్నల్ కావచ్చునని తెలిపింది. 1,395 టన్నుల ఈనౌకను 1977 లో జర్మనీలో నిర్మించారు. ఇది 1981 లో ఇండోనేషియా నావికాదళం లో చేరింది అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది 2012 లో కాలపరిమితి పూర్తయిన తరువాత దక్షిణ కొరియాలో రెండేళ్ల రిఫిట్ చేయించుకుంది. స్టాటిక్ డైవింగ్ సమయంలో బ్లాక్అవుట్ సంభవింఛి ఉండొచ్చనీ, ఇది నియంత్రణను కోల్పోయెలా, అత్యవసర విధానాలు చేయకుండా నిరోధింఛి ఉండవచ్చనీ నావికాదళం తెలిపింది.

ఆస్ట్రేలియా, మలేషియా, ఇండియా, సింగపూర్ అలాగే యునైటెడ్ స్టేట్స్ ప్రత్యేక నౌకలు, విమానాలను పంపడం ద్వారా ఇండోనేషియా సహాయం కోసం అనేక దేశాలు స్పందించాయి. జలాంతర్గామి శోధనకు సహాయపడటానికి యు.ఎస్. రక్షణ విభాగం “వాయుమార్గాన ఆస్తులను” పంపుతున్నట్లు పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ ట్విట్టర్‌లో తెలిపారు.

వీరందరి ప్రయత్నాలు ఫలించి జలాంతర్గామి లో చిక్కుకున్న 53 మందిని రక్షించగలమనే ఆశాభావాన్ని ఇండోనేషియా అధికారులు వ్యక్తం చేస్తున్నారు.