AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ticketless Travelling: ట్రైన్ టికెట్ లేకుండా ఎక్కాడు.. టీసీ వచ్చేసరికి ఏం చేశాడో చూడండి! నవ్వు రాకపోతే అడగండి!! Viral Video

రైల్లో టికెట్ కొనకుండా ప్రయాణించే వారు చెకింగ్ అధికారులు వచ్చినపుడు పడే పాట్లు భాలే ఉంటాయి. ఆ కంగారులో ఏమి చేస్తున్నారో తెలీకుండా విచిత్రమైన పనులు చేసి మరింత చిక్కుల్లో పడిపోతుంటారు.

Ticketless Travelling: ట్రైన్ టికెట్ లేకుండా ఎక్కాడు.. టీసీ వచ్చేసరికి ఏం చేశాడో చూడండి! నవ్వు రాకపోతే అడగండి!! Viral Video
Ticket Less Journey
KVD Varma
|

Updated on: Apr 23, 2021 | 9:51 PM

Share

Ticketless Travelling: రైల్లో టికెట్ కొనకుండా ప్రయాణించే వారు చెకింగ్ అధికారులు వచ్చినపుడు పడే పాట్లు భాలే ఉంటాయి. ఆ కంగారులో ఏమి చేస్తున్నారో తెలీకుండా విచిత్రమైన పనులు చేసి మరింత చిక్కుల్లో పడిపోతుంటారు. అది పిల్లికి చలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటంలా తయారవుతుంది. వారు చేసే చేష్టలు మిగిలిన ప్రయాణీకులకు వినోదాన్ని ఇస్తాయి. ఈ కంగారులో వారు ప్రమాదాల బారినా పడతారు. టికెట్ తీసుకోకుండా ఎందుకు రైలు ఎక్కానురా బాబూ అనుకునే పరిస్థితికి వెళ్ళిపోతారు. ఇదిగో ఈ మహానుభావుడి పరిస్థితి అలానే ఉంది ఇప్పుడు.

ఈ వీడియో చూడండి..

ఉక్రెయిన్‌లోని చెర్కాసీ ఓబ్లాస్ట్‌లో పైన మీరు వీడియోలో చూసిన సంఘటన జరిగింది. ఇందులో ఒక వ్యక్తి టికెట్ లేకుండా ఒక ట్రామ్ లో ప్రయాణిస్తున్నాడు. ఇంతలో.. టికెట్ కలెక్టర్ ఆ వ్యక్తిని సమీపిస్తున్నాడు. అది చూసి కంగారు పడిన ఆ వ్యక్తి కిటికీని పగలగొట్టి పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. తరువాత ఏమైందో ఈ వీడియోలో లేదు కానీ, కచ్చితంగా ట్రామ్ లోంచి పడిన సందర్భంలో గట్టిగానే గాయపడి ఉంటాడని అనుకోవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో తారస్ ఖ్విల్తో పోస్ట్ చేశారు. దానికి ఆయన ” పోలీసులు రాకముందే ఉల్లంఘనలు చేసే వారు పారిపోతారు.” అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఇక ఈ వీడియో తెగ వైరల్ అయిపోయింది. నెటిజన్లు ఈ వీడియోకు కామెంట్లు కూడా బాగానే పెట్టారు. చాలా మంది ఫన్నీగా కామెంట్లు పెడితే, టికెట్ లేకుండా అదేమీ పొయ్యే కాలం అన్నవారూ లేకపోలేదు. కొందరేమో పాపం..కిటికిలోంచి కిందకు పడి ఏ కాలు చెయ్యి విరాగ్గొట్టుకున్నాడో అని బాధను వ్యక్తీకరించారు.

Also Read: Indonesia submarine: ఇండోనేషియా జలాంతర్గామి కోసం ఆగని వెతుకులాట..అందులో ఆక్సిజన్ అయిపోతుందేమో అనే టెన్షన్..

Salman Khan: సౌత్ సినిమా సౌంగ్స్ పైన మోజుపడుతున్న సల్మాన్ ఖాన్.. రాధే మూవీలో ఆ పాట..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్