Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. 18 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్‌.. మైలేజీ ఎంతంటే..?

Ola Electric Scooter: ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ టాక్సీ సేవల.

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. 18 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్‌.. మైలేజీ ఎంతంటే..?
Ola Electric Scooter
Follow us
Subhash Goud

|

Updated on: Apr 23, 2021 | 8:19 PM

Ola Electric Scooter: ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ టాక్సీ సేవల సంస్థ ఓలా కూడా తమ మొదటి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జూలైలో భారత్‌లోకి సరికొత్త ఎలక్ట్రికల్‌ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇందు కోసం 400 నగరాలలో సుమారు లక్ష ఛార్జింగ్‌ పాయింట్లతో హైపర్‌ఛార్జర్‌ నెట్‌ వర్క్‌ను నెలకొపడంపై ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఓలా చైర్మన్‌ భవీష్‌ అగర్వాల్‌ తెలిపారు. మొదటి సంవత్సరంలో దేశంలో 100 ప్రధాన నగరాల్లో 5 వేల ఛార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసే ప్రణాళికతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ హైస్పీడ్‌ ఓలా ఛార్జింగ్‌ పాయింట్ల ద్వారా కేవలం 18 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జ్‌ చేయవచ్చని కంపెనీ తెలిపింది. దీన్ని ఒక్కసారి ఫుల్‌ ఛార్జింగ్‌ చేసినట్లయితే 75 కిలోమీటర్ల ప్రయాణం చేయగలదని కంపెనీ పేర్కొంది.

గత ఏడాది ఓలా తన మొదటి ఎలక్ట్రికల్‌ స్కూటర్‌ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని తమిళనాడులో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఫ్యాక్టరీ జూన్‌కల్లా సిద్ధం కానుంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా ప్రారంభ దశలో ఏటా 20 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాంట్‌ నిర్మాణం, స్కూటర్ల ఉత్పత్తి కోసం 2,400 కోట్ల పెట్టుబడి పెట్టింది. అయితే భారత మార్కెట్‌లోకి వీటిని ఎంత ధరకు అమ్ముతుందనే వివరాలు ఇంకా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే భారత్‌లో సరసమైన ధరలకే అందించనున్నట్లు ఓలా చెబుతోంది.

ఓలా చైర్మన్‌ భవీష్‌ అగర్వాల్‌ ఏమన్నారంటే..

ఈ ఎలక్ట్రికల్‌ స్కూటర్‌పై ఓలా చైర్మన్‌ భవీష్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. ఎలక్ట్రికల్‌ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడానికి బలమైన ఛార్జింగ్‌ నెట్‌ వర్క్‌ అవసరం. దేశంలో ఛార్జింగ్‌ స్టేషన్లు ఎక్కువ లేనందున ఎలక్ట్రిక్‌ వాహనాల పురోగతికి ఇది ఆటంకంగా మారుతోంది. అందువల్లే మేం కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రారంభించబోయే హైపర్‌ఛార్జర్‌ నెట్‌ వర్క్‌ ద్విచక్ర వాహనాలకు అతిపెద్ద ఫాస్ట్‌ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ అవుతుంది అని అన్నారు. ఇందులో భాగంగా దేశంలోని 400 నగరాలు, పట్టణాల్లో లక్షకు పైగా ఛార్జింగ్ పాయింట్లను నెలకొల్పాలని యోచిస్తున్నాం అని ఆయన చెప్పారు.