శబరిమల ఆలయానికి వెళ్తున్న బస్సుకి కొట్టాయం సమీపంలో ప్రమాదం.. డ్రైవర్ మృతి , 30 మంది గాయాలు

అయ్యప్ప మండల దీక్ష చేపట్టి.. స్వామి మాల ధారణ చేసి నియమ నిష్టలతో పూజ చేసి హరిహర సుతుడిని దర్శించుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన అయ్యప్ప భక్తులు వెళ్తున్న బస్సుకి ప్రమాదం జరిగింది. కేరళలోని కొట్టాయం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా, 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబందించిన వీడియోలు, చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శబరిమల ఆలయానికి వెళ్తున్న బస్సుకి కొట్టాయం సమీపంలో ప్రమాదం..  డ్రైవర్ మృతి , 30 మంది గాయాలు
Ayyappa Devotees Bus CrashesImage Credit source: X/@jsuryareddy
Follow us
Surya Kala

|

Updated on: Jan 03, 2025 | 1:44 PM

మండల దీక్ష తీసుకున్న అయ్యప్ప స్వాములు ఇరుముడులు ధరించి హైదరాబాద్ నుంచి శబరిమల కు కొంతమంది స్వాములు అయ్యప్ప దర్శనం కోసం పయణం అయ్యారు. అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు బుధవారం శబరిమలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కేరళలోని కొట్టాయంలోని కన్మల అట్టివాలం సమీపంలో ఘాట్ రోడ్డులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కొట్టాయం నుంచి శబరిమల వైపు వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. పంబా నదికి 15 కిలోమీటర్ల దూరంలో బస్సు అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అయ్యప్ప దర్సనం కోసం ఈ బస్సులో మొత్తం 30 మంది ప్రయాణీకులు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ 30 మంది ప్రయాణికుల్లో 8 మందికి తీవ్ర గాయాలు కాగా, మరో 22 మందికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. మృతుడు డ్రైవర్ ను సైదాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అదృష్టవశాత్తూ.. బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలో చెట్లు ఉండటం వల్ల ప్రమాద తీవ్రత తగ్గింది. అంతేకాదు బస్సు లోయలోకి పడిపోకుండా చెట్లు కాపాడాయి. దీంతో చాలా ఘోరమైన విషాదాన్ని చెట్లు నివారించాయి. మాదన్నపేటకు చెందిన అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను వెంటనే వైద్య చికిత్స కోసం కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..