AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Office: ప్రధాని కార్యాలయంలో వంట చేసేవారు, డ్రైవర్లు, క్లర్క్‌ల జీతం ఎంతో తెలుసా..?

PM Office: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆఫీస్‌ దేశంలోనే చాలా కీలకం. ప్రధాని కార్యాలయానికి భద్రతా అంతా ఇంతా కాదు. ఎప్పుడు కూడా నిఘా నీడలో ఉంటుంది. అంతేకాదు ప్రధాని కార్యాలయంలో పని చేసేవారు కూడా కీలక పాత్ర పోషిస్తారు. వంట చేసేవారి నుంచి డ్రైవర్ల వరకు అందరు కీలకమే. మరి వారి జీతాలు, విధులు ఎలా ఉంటా చూద్దాం..

PM Office: ప్రధాని కార్యాలయంలో వంట చేసేవారు, డ్రైవర్లు, క్లర్క్‌ల జీతం ఎంతో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Jan 03, 2025 | 3:10 PM

Share

ప్రస్తుత భారత ప్రధాని నరేంద్రమోడీ దేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరు. మన దేశ పాలనలో అత్యంత ప్రాముఖ్యత, బాధ్యత కలిగిన ప్రధాన మంత్రి కార్యాలయంలో పని చేసేవారి జీతం గురించి మీకు తెలుసా? ప్రధానమంత్రికి మద్దతుగా తెరవెనుక అవిశ్రాంతంగా పనిచేస్తున్న బృందం గురించి మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా? ప్రధానమంత్రి కార్యాలయంలో వంట చేసేవారు, డ్రైవర్లు, క్లర్క్‌ల జీతం.. ప్రాథమిక వేతనం మొదలవుతుంది.

వ్యక్తిగత కార్యదర్శుల నుండి పాలసీ సలహాదారుల వరకు, భద్రతా సిబ్బంది నుండి సీనియర్ బ్యూరోక్రాట్‌ల వరకు, ఈ వ్యక్తులు ప్రధానమంత్రి కార్యాలయం సజావుగా సాగేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. వారి బాధ్యతలలో తరచుగా అన్ని విషయాలు గోప్యంగా ఉంచడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై నిపుణుల సలహాలను అందించడం, దేశంలోని అత్యంత శక్తివంతమైన కార్యాలయాలలో ఒకదాని రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడం వంటివి ఉంటాయి. మీడియా నివేదికల ప్రకారం.. ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లోని డ్రైవర్లు పే బ్యాండ్ లెవల్-5లోపు జీతం పొందుతారు. ఇది రూ.29,200 నుండి రూ.92,300 వరకు ఉంటుంది.

ప్రధానమంత్రి కార్యాలయం (సెప్టెంబర్ 30, 2023 నాటికి) విడుదల చేసిన డేటా ప్రకారం.. PMOలో పనిచేసే డ్రైవర్ల ప్రాథమిక వేతనం, పెన్షన్ మొత్తాన్ని మినహాయించి, రూ.44,100 నుండి రూ.42,800 వరకు ఉంటుంది. ఆ సమయంలో పీఎంఓలో నలుగురు క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. 2023లో ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో పని చేసే కుక్‌లు పే బ్యాండ్ లెవల్ 1 కింద జీతం అందుకుంటారు. ఇది రూ. 18,000 నుండి రూ. 56,900 వరకు ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. వంట మనిషి బేసిక్‌ సాలరీ రూ.20,300.

ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే క్లర్క్‌లు సాధారణ కార్యాలయ పనులతో పాటు రికార్డుల నిర్వహణకు కూడా బాధ్యత వహిస్తారు. ప్రధానమంత్రి కార్యాలయంలోని క్లర్క్‌లకు పే బ్యాండ్ లెవల్ 2 కింద రూ. 19,000 నుండి రూ. 63,200 వరకు జీతం చెల్లిస్తారు. పీఎంఓలో క్లర్క్‌కు ప్రాథమిక వేతనం రూ.33,604.

ఇది కూడా చదవండి: Post Office Scheme: రూ. 5000 పెట్టుబడిపై చేతికి రూ.8 లక్షలు.. పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి