Sabarimala Airport: శబరిమల ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై కీలక అప్‌డేట్.. సర్వేలో ఏం తేల్చారంటే..?
కేరళలోని శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశ వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు శబరిమలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. అయితే అయ్యప్ప భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు శబరిమల సమీపంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. చాలా కాలంగా చిక్కుముడిలో ఉన్న ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు వేగంగా అమలు చేస్తున్నారు.
శబరిమల గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి సంబంధించిన సామాజిక ప్రభావ అధ్యయన నివేదిక వెలువడింది. కొట్టాయం జిల్లా యంత్రాంగం ప్రచురించిన నివేదిక ప్రకారం.. కొట్టాయం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు, అయ్యప్ప యాత్రికులకు సేవలందించేందుకు విమానాశ్రయం నిర్మాణం కోసం 3.4 లక్షల చెట్లను నరికి, 352 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. 3.3 లక్షల రబ్బరు, 2492 టేకు, 1131 పనస చెట్లు, 828 మహోగని, 184 మామిడి చెట్లను నరికివేయాలి. అంతే కాదు దేవాలయాలు, మసీదులను కూడా మార్చాలని సూచించారు. సెయింట్ థామస్ ఎక్యుమెనికల్ చర్చి, హిదాయుతుల్ ఇస్లాం జుమా మసీదు, శ్రీ అమ్మన్ కోవిల్, శ్రీ పూవన్‌పలమల దేవాలయం, సెయింట్ గ్రెగోరియో చర్చి, సెయింట్ జోసెఫ్ చర్చి కరీమ్‌హోట్, పంచతీర్థ పరాశక్తి దేవస్థానాలను కూడా తరలించాల్సి ఉంటుందని.. ఈ ప్రాంతంలోని ఒక పాఠశాల, 5 వ్యాపారాల సంస్థలను మార్చవలసి ఉంటుందని తెలుస్తోంది.
347 కుటుంబాలు ప్రభావితం
నివేదిక ప్రకారం విమానాశ్రయ నిర్మాణ ప్రాజెక్ట్ నేరుగా 347 కుటుంబాల జీవనోపాధిని ప్రభావితం చేస్తుంది. చెరువల్లి ఎస్టేట్‌కు సంబంధించి పనులు చేస్తున్న 238 కుటుంబాలు తమ నివాసాలను, జీవనోపాధిని కోల్పోతాయి. ఇక్కడ కనిపించే దేశవాళీ జాతి ఆవు చెరువల్లి ఆవులను కూడా ఈ ప్రాంతం నుంచి తరలించాల్సి ఉంటుంది. ఇది ఆవులు పర్యావరణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయని నివేదికలో వెల్లడించింది. ఈ ఆవుల పెంపకం స్థానికులకు ఆదాయ వనరు కూడా.
ఈ ప్రాజెక్టు కోసం మణిమాల, ఎరుమేలి సౌత్ గ్రామాల నుంచి 1039.876 హెక్టార్ల భూమిని సేకరిస్తున్నారు. శబరిమల యాత్రికులు, ఎన్నారైలు, పర్యాటకులు, ఇతర ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతిపాదిత శబరిమల గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రూపొందించినట్లు ప్రాజెక్ట్ ప్రమోటర్ KSIDC తెలిపింది.
పర్యాటక రంగానికి చేయూత
విమానాశ్రయం రాకతో వవారు చర్చి, మారమన్ కన్వెన్షన్, ఏటుమనూరు మహాదేవ దేవాలయం వంటి తీర్థయాత్రలకు రవాణా సదుపాయాలు మెరుగుపడతాయి. ఈ విమానాశ్రయం కుమరకం బ్యాక్ వాటర్, మున్నార్ హిల్ స్టేషన్లు, గవి, తేక్కడి వన్యప్రాణుల అభయారణ్యం, పెరియార్ టైగర్ రిజర్వ్ , ఇడుక్కి డ్యామ్ వంటి ప్రధాన పర్యాటక రంగాలను కలుపుతుంది. పార్లమెంట్‌కు సమర్పించిన నివేదిక ప్రకారం విమానాశ్రయం నిర్మిస్తే స్థానిక ఆర్థిక వ్యవస్థ, పర్యాటక రంగానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..