Viral Video: పిచ్చికి పరాకాష్ట.. న్యూ ఇయర్ వేడుకలను ఏకాంతంగా జరుపుకోవాలని ఏం చేశాడంటే..

ప్రపంచంలోని అనేక దేశాలు కొత్త సంవత్సరానికి భిన్నమైన పద్దతిలో స్వాగతం చెప్పాయి. ద్రాక్ష తింటూ, బకెట్ తో నీరు విసురుతూ ఇలా రకరకాల పద్దతిలో కొత్త సంవత్సరానికి వెల్కం చెప్పారు. అయితే రష్యాకు చెందిన ఒక వ్యక్తి భిన్నమైన పద్దతిలో కొత్త సంవత్సర వేడుకలను జరుపుకున్నాడు. కారుని సమాధి చేసి కొత్త ఏడాదికి వెల్కం చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Viral Video: పిచ్చికి పరాకాష్ట.. న్యూ ఇయర్ వేడుకలను ఏకాంతంగా జరుపుకోవాలని ఏం చేశాడంటే..
Vira Video
Follow us
Surya Kala

|

Updated on: Jan 03, 2025 | 12:22 PM

ప్రపంచంలో న్యూ ఇయర్‌ వేడుకలను భిన్నమైన పద్దతిలో జరుపుకున్నారు. అయితే రష్యాలో జరుపుకున్న న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన నిజంగా షాకింగ్‌గా ఉంది. ఎవ్జెనీ చెబోటరేవ్ అనే వ్యక్తి తన కారుతో పాటు సజీవ సమాధి అయ్యాడు. ఈ స్టంట్ చేసి ఇంటర్నెట్ ప్రజలను ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు ఖంగుతింటున్నారు. చాలా మంది దీనిని ప్రమాదకరం, బాధ్యతారాహిత్యం అని పేర్కొన్నారు. ఎందుకంటే ఇటువంటి విన్యాసాలు ప్రాణాంతకం ఒకొక్కసారి కావచ్చు.

ఎవ్జెనీ చెబోటరేవ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియో షేర్ చేశాడు. దీనిలో కొంతమంది తెల్ల కారుతో పాటు ఉన్న ఎవ్జెనీ చెబోటరేవ్ ని ఒక పొలంలో పాతిపెట్టడం కనిపిస్తుంది. తాను కారులో భూమిలో సమాధి అయినా కొంత ఇంటర్నెట్ పని చేస్తోంది.. గాలి కూడా వస్తుందని చెప్పాడు. అయితే తనను ఎక్కడ పాతిపెట్టారో చెప్పనన్నాడు.

ఇవి కూడా చదవండి

కొత్త సంవత్సర వేడుకలు డిఫరెంట్ గా జరుపుకోవాలనుకున్న ఈ రష్యన్ వ్యక్తి ఈ ప్రమాదకరమైన స్టంట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకు కొంతకాలం ప్రజలకు దూరంగా జీవించాలని.. విరామం తీసుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

ఆ వ్యక్తి కారుతో పాటు సజీవ సమాధి అయినప్పుడు వీడియో ఇక్కడ చూడండి

Instagram @chebotarev_evgenyలో 13 లక్షల మంది Evgenyని అనుసరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడంలో ఫేమస్. జనవరి 1న షేర్ చేసిన అతని రీల్‌ను ఇప్పటివరకు 23 లక్షల మంది లైక్ చేశారు. అయితే ఈ సారి మాత్రం సజీవ సమాధి లాంటి విన్యాసాలు చేయడం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. అదే సమయంలో ఈ స్టంట్ పట్ల భిన్నాభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు.

‘ఈ మూర్ఖత్వానికి ఏం పేరు పెట్టాలి?’

కంటెంట్ చూసి ఒక నెటిజన్ ఇలాంటి స్టంట్స్ చేసి తమ జీవితాలను కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. ఇంకో యూజర్ .. అంతా బాగానే ఉంది కానీ బాత్రూమ్‌కి వెళ్ళాల్సి వస్తే ఎలా అంటూ సందేహాన్ని వెల్లడించాడు. మరొకరు.. ఈ మూర్ఖత్వానికి ఏ పేరు పెట్టాలంటూ కామెంట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..