Huawei: చైనాకు చెందిన ప్రముఖ టెలికాం కంపెనీలో ఐటీ శాఖ దాడులు.. పలు రికార్డులు స్వాధీనం..

Huawei: చైనా(China)కు చెందిన ప్రముఖ టెలికాం కంపెనీ హువావేకి భారత ఐటి శాఖ(Income Tax Department) షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేత దర్యాప్తులో భాగంగా దేశంలోని చైనా టెలికాం కంపెనీ హువావేకి..

Huawei: చైనాకు చెందిన ప్రముఖ టెలికాం కంపెనీలో ఐటీ శాఖ దాడులు.. పలు రికార్డులు స్వాధీనం..
Huawei
Follow us
Surya Kala

|

Updated on: Feb 16, 2022 | 4:11 PM

Huawei: చైనా(China)కు చెందిన ప్రముఖ టెలికాం కంపెనీ హువావేకి భారత ఐటి శాఖ(Income Tax Department) షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేత దర్యాప్తులో భాగంగా దేశంలోని చైనా టెలికాం కంపెనీ హువావేకి చెందిన పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. ఢిల్లీలోని గురుగ్రామ్ (హర్యానా)లోని, కర్ణాటకలోని బెంగళూరు ప్రాంగణాల్లో కంపెనీ ప్రాంగణాల్లో దాడులు జరిగాయి. మంగళవారం కర్ణాటకలోని బెంగళూరు ప్రాంగణాల్లో దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. హువావే కి చెందిన భారతీయ వ్యాపారాలు,  విదేశీ లావాదేవీల ఆర్థిక పత్రాలు, ఖాతా పుస్తకాలు, కంపెనీ రికార్డులను అధికారులు పరిశీలించారు. కొన్ని రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు  అధికారులు  తెలిపారు. అయితే తాము భారత దేశంలోని కార్యకలాపాలను ఆ దేశ చట్టానికి, నియమాలకు కట్టుబడి ఉన్నామని హువావే ఒక ప్రకటనలో తెలిపింది.

“ఆదాయపు పన్ను బృందం మా కార్యాలయాన్ని సందర్శించినట్లు , కొంతమంది సిబ్బందిని ఎంక్వయిరీ చేసినట్లు తమకు సమాచారం అందిందని కంపెనీ అధికారులు చెప్పారు. భారత ప్రభుత్వం Huaweiని 5G సేవల కోసం ట్రయల్స్ నుండి దూరంగా ఉంచింది. పన్నుఎగవేత విషయంలో హువావేపై ఆరోపణలనువినిపించడంతో కేంద్ర ప్రభుత్వం 5G సేవల కోసం హువావేను ట్రయల్స్ నుంచి దూరంగా ఉంచిన సంగతి తెలిసిందే. అయితే టెలికాం ఆపరేటర్లు తమ నెట్‌వర్క్‌లను నిర్వహించడానికి  పాత ఒప్పందాల ప్రకారం హువావే, ZTE నుంచి టెలికాం గేర్‌ను సోర్స్ చేయడానికి అనుమతినిచ్చింది.  అయితే టెలికమ్యూనికేషన్ సెక్టార్‌పై నేషనల్ సెక్యూరిటీ డైరెక్టివ్ ప్రకారం ఏదైనా కొత్త వ్యాపార ఒప్పందం చేసుకునే  ముందు వారికి ప్రభుత్వం ఆమోదం అవసరం.

Also Read:

ఎడబాటు తట్టుకోలేక – యువతి ఆత్మహత్య.. ప్రియురాలి మరణ వార్త విని.. యువకుడు బలవన్మరణం