AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మంచు కురుస్తున్న వేళ.. భూతల స్వర్గాన్ని తలపిస్తున్న లోయలు..

కాశ్మీర్ అందాల గూర్చి వర్ణించడానికి ఎవరికైనా మాటలు చాలవు. అలాంటిది భారీ స్థాయిలో తెల్లని మంచు కురుస్తుంటే ఇంకెలా ఉంటుందో అది మీ ఊహకే వదిలేస్తున్నాం..

Viral: మంచు కురుస్తున్న వేళ.. భూతల స్వర్గాన్ని తలపిస్తున్న లోయలు..
Kashmir
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Dec 08, 2024 | 7:17 PM

Share

కాశ్మీర్ అందాలను ఎంత సేపు చూసినా తనివి తీరదు. ఆ మనోహరమైన ప్రాంతం అపారమైన కళ్లు వేసుకొని చూసేలా ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. మామూలుగానే అంత బాగుంటుంది అనుకుంటే.. అలాంటిది భారీ స్థాయిలో తెల్లని మంచు కురుస్తుంటే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. ప్రస్తుతం అక్కడ మంచు వర్షం కురుస్తుంది. ఈ సమయంలో ఆ ప్రాంతంలో మనం కూడా ఉంటే ఎంత బాగుండు అని అనుకోనివారు ఉండరేమో కదా. ఆ చల్లని మంచును, ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించాలని ఎందుకు ఉండదు చెప్పండి..!

ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్‌లో తెల్లవారుజామున నుంచి మంచు వర్షంలా కురుస్తోంది. కాశ్మీర్‌లో ఈ రాత్రి నుంచి వాతావరణం తడిగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మైదాన ప్రాంతాల్లో వర్షాలు, కొండలపై తేలికపాటి నుంచి మోస్తరు మంచు కురుస్తోంది. జమ్మూకాశ్మీర్‌లో రాబోయే రెండు రోజులు తేలికపాటి వర్షాలతో పాటు మంచు ఇదే విధంగా కురుస్తుందని అంచనా వేశారు. దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్‌ మైనస్ 4.5 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడింది. ఇది అత్యంత శీతల ప్రదేశం. మరోవైపు జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత.. మునుపటి రాత్రి మైనస్ 4.1 డిగ్రీల సెల్సియస్‌తో పోలిస్తే ప్రస్తుతం మెరుగుపడింది. ఇది ఈ సీజన్‌లోనే ఇప్పటివరకు మూడవ అత్యల్పంగా ఉంది.

ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారాలో కూడా ఇదే విధమైన రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. కాశ్మీర్ ముఖ ద్వారమైన ఖాజిగుండ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 2.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా.. దక్షిణ కాశ్మీర్‌లోని కోకెర్‌నాగ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 2.2 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us