బాబోయ్‌ ఇవేం కట్నాలు సామీ..! పెళ్లిలో నోట్ల వర్షం కురిపించారు.. ఎన్ని కోట్లో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

భారతీయ సంప్రదాయాల్లో కొన్ని వివాహాల్లో వరుడి చెప్పులను దొంగిలించి దాచిపెట్టే ఆచారం 'జూటా చురై'లో భాగంగా వధువు బంధువులు వరుడి బావకు రూ.11 లక్షలు బహుమతిగా ఇచ్చారు. పెళ్లి జరిపించన వ్యక్తికి రూ.11 లక్షలు ఇచ్చారు. వివాహాన్ని నిర్వహించిన స్థానిక మసీదుకు రూ.8 లక్షలు అందించారు. ఇంకా..వరుడి కోసం..

బాబోయ్‌ ఇవేం కట్నాలు సామీ..! పెళ్లిలో నోట్ల వర్షం కురిపించారు.. ఎన్ని కోట్లో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
Groom
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 08, 2024 | 7:05 PM

భారతదేశంలో పెళ్లిళ్లకే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఎన్నో పెళ్లిళ్లు కోట్ల రూపాయల వ్యాపారాలుగా మారాయి. ఈ క్రమంలోనే మీరట్‌లో జరిగిన ఓ వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ముస్లింల వివాహానికి సంబంధించిన వీడియో ఇందులో భారీ మొత్తంలో డబ్బు ముట్టజెబుతున్నట్టుగా కనిపిస్తుంది. వధువు కుటుంబం వరుడికి 2.5 కోట్లు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. భారతీయ వివాహాల్లో వరుడి పాదరక్షలను దొంగిలించే ఆచారం ‘జూటా చురై’లో భాగంగా వధువు బంధువులు వరుడి బావకు రూ.11 లక్షలు బహుమతిగా ఇచ్చారు. పెళ్లి జరిపించన వ్యక్తికి రూ.11 లక్షలు ఇచ్చారు. వివాహాన్ని నిర్వహించిన స్థానిక మసీదుకు రూ.8 లక్షలు అందించారు.

మీరట్‌లోని NH-58లోని రిసార్ట్‌లో జరిగిన వివాహ వేడుకకు సంబంధించిన దృశ్యాలు. డబ్బుతో నిండిన సూట్‌కేస్‌లను జనాల గుండా వరుడి కుటుంబానికి పంపించారు. ‘రూ.2 కోట్లు ఇస్తున్నారు.. కారు కొనేందుకు రూ.75 లక్షలు ఇస్తున్నారు’ అని ఓ వ్యక్తి వీడియోలో చెబుతున్నాడు. దీని తరువాత, మూడు పెద్ద నీలం పెట్టెలు ఇవ్వబడ్డాయి. వరుడి కుటుంబం ఘజియాబాద్‌లోని ఒక మసీదుకు ఎనిమిది లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించి, ఆ డబ్బును వధువు కుటుంబానికి అందజేస్తుంది.

ఇవి కూడా చదవండి

దీని తర్వాత నికాహ్ చేసే మౌల్వీకి రూ.11 లక్షలు, చెప్పుల చోరీ చేసే వ్యక్తికి రూ.11 లక్షలు ఇస్తారు. ఇంతటితో వీడియో ముగుస్తుంది. ఎవరి పెళ్లి అనేది వీడియోలో పేర్కొనలేదు. దేశంలో ఇంత ద్రవ్యోల్బణం ఉన్న సమయంలో సోషల్ మీడియా వినియోగదారులు కరెన్సీ కట్టలు కుమ్మరిస్తూ జరిగిన ఈ పెళ్లిపై నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. మరికొందరు సోషల్ మీడియా వినియోగదారులు వరకట్న వ్యవస్థపై నిషేధం ప్రశ్నను లేవనెత్తుతూ పోస్ట్‌లు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..