ఆహా.. ఏం భక్తిరా బాబు..! దొంగతనానికి ముందు ఈ దొంగ చేసిన పని చూస్తే దేవుడు కూడా..

దొంగలకు కూడా తమ స్వంత భావాలు ఉంటాయి. దొంగలు తప్పు చేసినా కూడా వారికి దేవునిపై పూర్తి విశ్వాసం ఉంటుంది. అలాంటి వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. అందులో భాగంగా కొందరు దొంగలు చోరీకి వెళ్లిన సమయంలో ముందుగా దేవుడికి నమస్కరించుకోవటం వంటివి చూస్తుంటాం. చేసేది తప్పు అని తెలిసి కూడా దొంగలు దేవుడికి మొక్కుకోవటం చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. అదేంటో పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆహా.. ఏం భక్తిరా బాబు..! దొంగతనానికి ముందు ఈ దొంగ చేసిన పని చూస్తే దేవుడు కూడా..
Thief Praying Before Steali
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 08, 2024 | 5:52 PM

దొంగలకు కూడా తమ స్వంత భావాలు ఉంటాయి. దొంగలు తప్పు చేసినా కూడా వారికి దేవునిపై పూర్తి విశ్వాసం ఉంటుంది. అలాంటి వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. అందులో భాగంగా కొందరు దొంగలు చోరీకి వెళ్లిన సమయంలో ముందుగా దేవుడికి నమస్కరించుకోవటం వంటివి చూస్తుంటాం. చేసేది తప్పు అని తెలిసి కూడా దొంగలు దేవుడికి మొక్కుకోవటం చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. అదేంటో పూర్తి వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే దొంగతనం చేసేందుకు పెట్రోల్ పంప్ కార్యాలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి చేసిన విచిత్ర పనికి సంబంధించిన వీడియో మధ్యప్రదేశ్ నుండి వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ దొంగ దొంగతనం చేసే ముందు మరో పని చేశాడు.. అతడు చేసిన పని అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. సోషల్ మీడియాలో CCTV ఫుటేజ్ క్లిప్ వైరల్ అవుతోంది. ఇందులో దొంగతనం కాకుండా, సదరు దొంగ దేవుని పట్ల చూపించిన భక్తిపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మధ్యప్రదేశ్‌లోని మచల్‌పూర్ జిల్లాలో శనివారం రాత్రి ఓ వ్యక్తి పెట్రోల్‌ పంప్‌ కార్యాలయంలోకి చోరీకి ప్రయత్నించాడు. పెట్రోల్ పంపు ఆఫీస్‌ గదిలోకి ప్రవేశించిన అతడు ముందుగా దేవుడికి నమస్కరించుకోవటం కనిపించింది. ఇది చూస్తుంటే ఈ దొంగ దేవుడి ముందు తల వంచి తన పనికి అనుమతి తీసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. దీని తర్వాత అతను తన పనిని ప్రారంభిస్తాడు. అక్కడున్న అన్ని డ్రాయర్‌లను తెరిచి చూసుకున్నాడు. ప్రతిచోటా నగదు కోసం వెతకడం ప్రారంభించాడు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ ఉదంతం చోరీకే కాకుండా దొంగ చేసిన పని కారణంగా నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సుమారు రూ.1.57 లక్షలను దొంగ ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన సమయంలో పెట్రోల్‌ బంక్‌ ఉద్యోగులు నిద్రిస్తున్నారు. చోరీ అనంతరం దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం ప్రకారం, అప్పటికి పెట్రోల్ పంప్ ఉద్యోగులు నిద్రలేచి దొంగను పట్టుకోలేకపోయారు. దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీలను పరిశీలించి ఆధారాలు వెతికే ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..