AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మహా నగరంలో మాయగాళ్లు.. పచ్చ చెట్లను ఇలా చంపేస్తున్నారు.. షాకింగ్‌ వీడియో వైరల్‌

ఆర్థిక రాజధానిలో షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. మహా నగర పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో కావాలనే చెట్లను చంపేస్తున్నారు. అదెలా అంటారా..? ఆ చెట్ల బెరడులకు ఇంజక్షన్లు ఇస్తూ ముందుగా ఆ చెట్లను ఎండబెడతారు. అవి ఎండిపోయిన తర్వాత ఆ చెట్లను స్మగ్లర్లు నరికి తీసుకెళ్తుంటారు. ఇందుకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో బయటికి వచ్చింది. ఈ సంఘటన ముంబైని ఆనుకుని ఉన్న థానే జిల్లాలోని నౌపడ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. చెట్లను నరికి తీసుకెళ్తున్న తతంగం మొత్తం అక్కడి సీసీటీవీల్లో రికార్డయింది.

Smugglers Injecting Green T
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Dec 08, 2024 | 6:19 PM

Share

ఆర్థిక రాజధానిలో షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. మహా నగర పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో కావాలనే చెట్లను చంపేస్తున్నారు. అదెలా అంటారా..? ఆ చెట్ల బెరడులకు ఇంజక్షన్లు ఇస్తూ ముందుగా ఆ చెట్లను ఎండబెడతారు. అవి ఎండిపోయిన తర్వాత ఆ చెట్లను స్మగ్లర్లు నరికి తీసుకెళ్తుంటారు. ఇందుకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో బయటికి వచ్చింది. ఈ సంఘటన ముంబైని ఆనుకుని ఉన్న థానే జిల్లాలోని నౌపడ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. చెట్లను నరికి తీసుకెళ్తున్న తతంగం మొత్తం అక్కడి సీసీటీవీల్లో రికార్డయింది.

ఈ ఏడాది నవంబర్ 29వ తేదీ రాత్రి రోడ్డు పక్కన స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ వారు నాటిన చెట్లకు గుర్తు తెలియని వ్యక్తి ఇంజక్షన్లు వేశాడు. ఆ వ్యక్తి చెట్లు ఎండిపోవడానికి ఉపయోగపడే ఒక మందును ఇంజక్షన్ ద్వారా ఇస్తూ కనిపించాడు. అలా చేసిన  తర్వాత అదే చెట్టు తన పచ్చదనాన్ని కోల్పోయి ఒక్కసారిగా ఎండిపోవడం ప్రారంభించింది. స్థానిక ప్రజలు చెట్లు ఉన్నట్లుండి ఎండిపోవడం వెనక రహస్యం ఏంటో అంతు పట్టక సీసీటీవీని పరిశీలించగా.. నవంబర్ 29న ఎవరో చెట్లకు ఇంజక్షన్‌ వేసినట్లు కనిపించడం.. ఆపై అవి కొద్ది రోజుల్లోనే ఎండిపోవడం గమనించారు. అసలు దేని కోసం ఇలా చేస్తున్నారు? అసలు వాళ్లు ఎవరు అనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

నౌపడ ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెట్లకు ఇంజక్షన్లు ఇచ్చి ఎండిపోయేలా చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎక్కువగా ఎవరూ లేని సమయం చూసి రాత్రి పూట చీకట్లో చెట్లను నరికి తీసుకెళ్తున్నారని, ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా సీసీటీవీల్లో రికార్డు అవ్వడంతో స్థానికులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా పచ్చని చెట్లను ఎండిపోయేలా చేస్తూ నరికి తీసుకెళ్తున్న వ్యక్తిని తొందర్లోనే గుర్తించి పట్టుకుంటామని, ఇకపై ఇలాంటివి జరగకుండా ఆపుతామని థానే పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో

అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా

కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..

థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం

2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా

సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే

పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..

రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!