AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతి శుక్రవారం ఆమెకు పాము గండం.. ఇప్పటికీ 11సార్లు వెంటాడి కాటువేసింది..

గ్రామంలో శివాలయం నిర్మించారు. విగ్రహాన్ని ప్రతిష్టించారు.. పదే పదే ఆ పరమశివుడికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. కానీ పాము మాత్రం తన కూతురిని వెంబడించడం వదలడం లేదని వాపోతున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

ప్రతి శుక్రవారం ఆమెకు పాము గండం.. ఇప్పటికీ 11సార్లు వెంటాడి కాటువేసింది..
Mahoba Black Snake
Jyothi Gadda
|

Updated on: Dec 08, 2024 | 5:10 PM

Share

సినిమా కథను తలపించే ఓ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ 19 ఏళ్ల యువతిని గత ఐదేళ్లుగా నల్లతాచుపాము వెంటాడుతోంది. ఇప్పటి వరకు ఆమెను పాము కాటువేసింది. తాజాగా మరోమారు యువతి పాము కాటుకు గురైంది. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన తెలిసిన డాక్టర్లు కూడా షాక్‌ అవుతున్నారు. ఇలా తరచూ యువతిపై పాము దాడి చేస్తుండటం పట్ల కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు.

పాము దాడి నుంచి తమ కుమార్తెను రక్షించేందుకు కుటుంబ సభ్యులు తాంత్రికులు, భూతవైద్యులకు కూడా చూపించామని బాధిత యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గ్రామంలో శివాలయం నిర్మించారు. విగ్రహాన్ని ప్రతిష్టించారు.. పదే పదే ఆ పరమశివుడికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. కానీ పాము మాత్రం తన కూతురిని వెంబడించడం వదలడం లేదని వాపోతున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 2019లో తొలిసారిగా తమ కూతురిని నల్లతాచుపాము కాటు వేసిందని, అప్పటి నుంచి నేటి వరకు ఆ పాము తమ కూతురిని వెంటాడుతూనే ఉందని చెబుతున్నారు.

ఈ సంఘటన జిల్లాలోని చర్ఖారీ తహసీల్‌లోని పంచంపుర గ్రామంలో జరిగింది. ఈ ప్రాంత నివాసి దల్పత్ తన కుమార్తె రోష్ణిని నిరంతరం నల్లతాచుపాము కాటు వేస్తోందని చెప్పాడు. ఇప్పటి వరకు ఆమెను 11 సార్లు కాటువేసింది. 2019లో తన కూతురు తన పొలంలో పనిచేస్తుండగా, అనుకోకుండా ఆమె ఒక నల్ల తాచు పాము తోకను తొక్కేసింది. దాంతో ఆ పాము రోష్ణిని కాటేసింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం వైద్యులు రోష్ణిని కాపాడారు. కానీ, ఆ తరువాత కూడా ఆ పాము వరుసగా తనపై దాడి చేస్తూనే ఉందని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

నల్లతాచు పాము తన కూతురిని ఎప్పుడు, ఎక్కడ కాటేస్తుందోనని వారంతా భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని చెప్పారు. పాము కాటు నుంచి తప్పించుకునేందుకు గానూ ఆమె తన బంధువుల ఇంటికి వెళ్లినా కూడా పాము ఆమెను వదల్లేదు. ప్రతి శుక్రవారం చూసుకుని పాము తమ కూతురిని కాటువేస్తుందని చెప్పారు. ఈసారి శుక్రవారం మరోసారి పాము కాటేసింది. చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. ఇప్పటి వరకు నల్లతాచు పాము తన కూతురిని 11 సార్లు కాటేసిందని చెప్పాడు.

అంతేకాదు..జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా మంచంపై పడివున్న తమ కూతురిని పాము కాటు వేసిందని దల్పత్ చెప్పాడు. ఈ ఘటనలతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..