Goat Milk: మేక పాలు తాగితే కలిగే లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు..!
కణాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మేక పాలు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ప్రతిరోజు మేకపాలు తాగడం వల్ల రక్తపోటు నియంత్రిస్తుంది. మేక పాలను తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.
మేక పాలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గేదె, ఆవు పాలు మాదిరిగానే మేక పాలు తాగడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మేక పాలలో కూడా పోషకగుణాలు సమృద్ధిగా ఉంటాయని చెబుతున్నారు. ప్రొటీన్స్, కాల్షియం ఎక్కువగా ఉండే మేక పాలను తాగడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయని చెబుతున్నారు. మేక పాలల్లో అమినోయాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని సక్రమంగా అందుతాయి.
ఆవు పాల కంటే ఎక్కువ ప్రోటీన్, అవసరమైన విటమిన్లు, తక్కువ లాక్టోస్ మేకపాలలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో మేకపాలు సలభంగా జీర్ణమవుతాయని అంటున్నారు. ఒక కప్పు మేక పాలు తీసుకోవడం వల్ల 30 శాతం ఫాటీ ఆమ్లాలను శరీరం అధికంగా పొందుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మేక పాలలో ఉండే బయోఆర్గానికి సోడియం శరీరానికి చాలా మేలు చేస్తుంది. కణాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మేక పాలు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ప్రతిరోజు మేకపాలు తాగడం వల్ల రక్తపోటు నియంత్రిస్తుంది. మేక పాలను తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.
డెంగ్యూ సోకిన వారికి రక్తంలో ప్లేట్ లేట్స్ తగ్గిపోతుంటాయి. వారికి మేక పాలు ఇస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు. కానీ, డెంగ్యూ చికిత్సతో దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఒక పోషకమైన ఎంపిక, శరీరానికి అవసరమైన పోషణను అందించగలదని నిపుణులు అంటున్నారు, అయితే ఇది ప్లేట్‌లెట్లను పెంచడంలో లేదా డెంగ్యూ వైరస్ ప్రభావాన్ని నేరుగా నియంత్రించడంలో సహాయపడదు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..