NET-TET Exams: ఒకేసారి రెండు పరీక్షలు.. ఆందోళనలో అభ్యర్థులు.. డేట్స్‌ మార్పు చేయాలని విజ్ఞప్తి!

అయితే జాతీయ స్థాయిలో జరిగే పరీక్ష వాయిదా వేయడం కుదరనీ పని కాబట్టి, రాష్ట్రస్థాయిలో నిర్వహించే టెట్ ను వాయిదా వేయాలని అభ్యర్థులు సర్కార్ ను విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. నెట్ పరీక్ష లేని రోజు టెట్ పరీక్ష రాసేలా అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

NET-TET Exams: ఒకేసారి రెండు పరీక్షలు.. ఆందోళనలో అభ్యర్థులు.. డేట్స్‌ మార్పు చేయాలని విజ్ఞప్తి!
Net, Tet Exams
Follow us
Vidyasagar Gunti

| Edited By: Jyothi Gadda

Updated on: Dec 07, 2024 | 5:46 PM

తెలంగాణలో ఏటా రెండు సార్లు టెట్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు అందుకు అనుగుణంగా రెండో టెట్ కు ఈ ఏడాది నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో కొత్తగా టీచర్ కావాలనుకున్న అభ్యర్థుల ఆనందానికి అవధులు లేవు. కానీ టెట్ పరీక్ష తేదీలు విన్న అభ్యర్థులకు మాత్రం చిన్న చిక్కు వచ్చి పడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం టెట్ ఎగ్జామ్ తేదీలు మార్చాలని అభ్యర్థులు కోరుతున్నారు. నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్(నెట్), టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్) ఒకే షెడ్యూల్లో పరీక్షలు జరగనున్నాయి.

జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత కోసం నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్(నెట్)ను 2025 జనవరి 1 నుంచి జనవరి 19 వరకూ నిర్వహించనున్నట్టు ఇటీవల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. రాష్ట్రంలో టీచర్ పోస్టులకు అర్హత కోసం టెట్ పరీక్షను 2025 జవనరి 1 నుంచి జనవరి 20 తేదీల మధ్యలో పెడతామని ఇప్పటికే విద్యాశాఖ వెల్లడించింది. దీంతో రెండు పరీక్షలు ఒకే షెడ్యూల్లో ఉండటంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొన్నది. నెట్ అప్లికేషన్ల ప్రక్రియ నవంబర్ 19 నుంచి ప్రారంభం కాగా.. డిసెంబర్ 10 వరకూ అప్లైకి అవకాశం ఉంది. మరోపక్క టెట్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాగా, మొత్తం 2,75,773 అప్లికేషన్లు వచ్చాయి. అయితే జాతీయ స్థాయిలో జరిగే పరీక్ష వాయిదా వేయడం కుదరనీ పని కాబట్టి, రాష్ట్రస్థాయిలో నిర్వహించే టెట్ ను వాయిదా వేయాలని అభ్యర్థులు సర్కార్ ను విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. నెట్ పరీక్ష లేని రోజు టెట్ పరీక్ష రాసేలా అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

అభ్యర్థుల విజ్ఞప్తి పై రాష్ట్ర సర్కారు సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. విద్యాశాఖ లో కీలక మార్పులు జరుగుతున్న తరుణంలో డిసెంబర్ చివరి నాటికి దీనిపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఎక్కువ మంది అభ్యర్థులు నెట్ పరీక్ష ముగిసిన తర్వాత టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తే బాగుంటదనీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి