- Telugu News Photo Gallery Wonderful Benefits Of Having Buttermilk Post Meals In Telugu Lifestyle News
Buttermilk Benefits : భోజనం తర్వాత మజ్జిగ తాగితే బోలెడు లాభాలు.. తెలిస్తే మిస్ చేయరు..!
మజ్జిగ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వైద్యులు కూడా పెరుగు కాకుండా మజ్జిగ వేసుకొని అన్నం తినమని సూచిస్తారు. నిజానికి మజ్జిగ ఎలా ఎప్పుడు ఏ సమయంలో తాగిన ఎటువంటి నష్టం లేదని చెబుతున్నారు. మీ దిన చర్యలో భాగంగా మీరు భోజనం చివరిలో మజ్జిగ వేసుకొని తింటే మంచిది. లేదంటే భోజనం చేసాక ఒక గ్లాస్ మజ్జిగ తాగినా పర్వాలేదు అంటున్నారు. భోజనం తర్వాత తీసుకునే మజ్జిగతో మరిన్ని లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Dec 07, 2024 | 3:07 PM

మజ్జిగలో కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. అందుకే మజ్జిగను రోజూ తినే ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఆయుష్యు పెరుగుతుంది. మజ్జిగలో కాల్షియంతో పాటు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కూడా అధికంగా ఉంటాయి. కొవ్వులు తక్కువగా ఉన్న బటర్ మిల్క్ లో లాక్టిక్ యాసిడ్ అని పిలువబడే మంచి బ్యాక్టీరియా ఉంటుంది.

లాక్టిక్ యాసిడ్ అనే ఈ బ్యాక్టీరియా మనుషుల్లో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. బటర్ మిల్క్‌లో విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. మజ్జిగ కేవలం చలవ చేయడం మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుందని.. బరువు తగ్గడంలో ఉపయోపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది శరీరంపై ప్రత్యేకించి జీర్ణవ్యవస్థపై శీతలీకరణ ప్రభావాన్ని అందిస్తుంది, యాసిడ్ రిఫ్లక్స్ కారణంగా కడుపు లైనింగ్‌లో ఏర్పడే చికాకును తగ్గిస్తుంది. ఆహారంతో పాటు మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. ఇది ఎసిడిటీని అదుపు చేసి ఎముకలను బలపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి మజ్జిగ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మజ్జిగ ప్రోబయోటిక్ అంటే అందులో ఆరోగ్యకరమైన లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుంది. మజ్జిగ అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలకు కూడా సహాయపడుతుంది.

మజ్జిగలో విటమిన్ డి ఉంటుంది. ఇది కాల్షియం శోషణకు సహాయపడుతుంది. ఎముకలు బలపడతాయి. స్త్రీలు రుతుక్రమం తర్వాత మజ్జిగ తీసుకోవడం మంచిది. ఖాళీ కడుపుతో మరీ మంచిది. నిత్యం పల్చని మజ్జిగను తయారు చేసుకుని తాగితే తప్పక త్వరలోనే ఫలితం కనిపిస్తుంది.





























