- Telugu News Photo Gallery Why ragi should be in your diet: A nutrient powerhouse for bone, heart, and digestive health
ఇవి ధాన్యం కాదు.. మధుమేహులకు దివ్యౌషధం..! ఇలా తింటే ఆ సమస్యలన్నీ పరార్..
రాగులు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మన రోజు వారి ఆహారంలో రాగులను తప్పనిసరిగా చేర్చుకోవాలని పోషకాహర నిపుణులు పదే పదే చెబుతున్నారు. దీంతో పుష్కలమైన ప్రయోజనాలు పొందుతారని అంటున్నారు. రాగుల్లో ఎన్నో అద్భుత పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల ఎముకలు, జుట్టు, చర్మం, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు. వీటిని మనం బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే రోజంతటికీ కావాల్సిన శక్తి లభిస్తుంది. ఇంకా మరెన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు.అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Dec 08, 2024 | 4:44 PM

రాగులలో బి1, బి2, బి6, కె విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫొలేట్, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రాగులను క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

రాగుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రాగులను క్రమంతప్పకుండా తీసుకోవటం వల్ల శరీరంలో పోషకాహార లోపం తీరుతుంది. ప్రమాదకరమైన వ్యాధులకు దూరం చేస్తుంది. రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసే వారికి చక్కగా ఉపయోగపడతాయి. రాగులతో కండరాల నిర్మాణం సరిగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించడంలో రాగులు సమర్థవంతంగా పనిచేస్తాయి. గుండె సంబంధి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి రాగులు చాలా మంచిది. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు తక్కువగా ఉండి.. షుగర్ లెవల్స్‌ని కంట్రోల్లో ఉండేలా చేస్తాయి. కాబట్టి మధుమేహులకు ఇవి వరమని అంటున్నారు.

రక్తహీనతతో బాధపడేవారికి ఇది సరైన ఆహారం. చర్మం ముడతలు పడదు. ముఖానికి కాంతి వస్తుంది. జీర్ణ ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. అలాగే.. రాగులు క్రమం తప్పకుండా తింటే కావలసినంత క్యాల్షియం అందుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయని చెబుతున్నారు.

రాగులతో తయారు చేసిన రొట్టెలు ఎముకల సాంద్రతను పెంచి అవి బలంగా మారడానికి తోడ్పడతాయి. రాగి జావను తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే రాగుల్లో ఉండే పోషకాలు, ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ అందుతాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది.




