- Telugu News Photo Gallery Cinema photos Power Star Pawan kalyan OG and hari hara vallu mallu Shooting Update, OG will be Release in March
Pawan kalyan: ఓజీ vs హరిహరవీరమల్లు లో పవర్‌స్టార్ ఎటు మొగ్గుతారు.? ఇదే హాట్ టాపిక్.!
ఎడమ కన్నూ నాదే.. కుడి కన్నూ నాదే.. రెండిటిలో దేనికి ఇంపార్టెన్స్ అంటే ఏం చెప్పాలి.? ఈ మాటలు మీరూ, నేనూ అనుకోవడానికి బానే ఉంటాయి. కానీ కుడి ఎడమల్లో ఏదో ఒకదాన్ని కచ్చితంగా సెలక్ట్ చేసుకోవాల్సి వస్తే ఏం చేయాలి? సేమ్ సిట్చువేషన్‌లో ఉన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు.? హరిహరవీరమల్లు.. పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా. ఎ.ఎం.రత్నం సమర్పణలో క్రిష్ మొదలుపెట్టారు. ఇప్పుడు జ్యోతికృష్ణ టేకప్ చేశారు.
Updated on: Dec 08, 2024 | 4:44 PM

ఎడమ కన్నూ నాదే.. కుడి కన్నూ నాదే.. రెండిటిలో దేనికి ఇంపార్టెన్స్ అంటే ఏం చెప్పాలి.? ఈ మాటలు మీరూ, నేనూ అనుకోవడానికి బానే ఉంటాయి.

కానీ కుడి ఎడమల్లో ఏదో ఒకదాన్ని కచ్చితంగా సెలక్ట్ చేసుకోవాల్సి వస్తే ఏం చేయాలి? సేమ్ సిట్చువేషన్‌లో ఉన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు?

కలలో కూడా ఊహించని విజయాలతో పాటు.. దేశ రాజకీయాల్ని మలుపుతిప్పే శక్తిగా నిలిచారు జనసేనాని. ఇవన్నీ ఉండగానే తాజాగా మరో సంచలనం సృష్టించారు పవర్ స్టార్.

మనపైనున్న దొంగలందర్నీ దోచుకోవడానికి ఆ భగవంతుడు కచ్చితంగా ఒకడ్ని పంపిస్తాడు.. వాడొచ్చి ఈ దొంగ దొరల లెక్కలన్నీ సరిచేస్తాడు అంటూ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే క్రేజ్ తెచ్చుకుంది హరిహరవీరమల్లు.

కానీ, ఇంకా ఎనిమిది రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని చెప్పేశారు పవర్‌స్టార్. మార్చిలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరిలోనే సినిమాను కంప్లీట్ చేస్తారనే టాక్ నడుస్తోంది.

వీలున్నప్పుడు కాల్షీట్ ఇచ్చి సినిమాలు కంప్లీట్ చేస్తానన్నది పవన్ కల్యాణ్ మాట. ఆయనకు కుదిరినప్పుడే కాల్షీట్ ఇచ్చినా 2025లో ఓజీ కంప్లీట్ అవుతుందన్నది ఫ్యాన్స్ అంచనా.

హరిహరవీరమల్లుతో పాటు ఓజీ మీద కూడా చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకో నాలుగైదు రోజులు పవన్ కాల్షీట్ ఇస్తే చాలు.. సినిమాను కంప్లీట్ చేసేసుకుంటామనే మాట ఈ కాంపౌండ్‌లోనూ వినిపిస్తోంది.

ఆయన కాల్షీట్ కేటాయించినా, షూటింగ్ పూర్తి కాలేదన్నది ఫ్యాన్స్ కి చేరిన వార్త. మరేం ఫర్వాలేదు.. మీకు టైమ్ ఉన్నప్పుడే చేయండి.. బ్లాక్ బస్టర్ చేయడానికి మేం రెడీగా ఉన్నాం అనే ధీమా కనిపిస్తోంది ఫ్యాన్స్ లో.




