- Telugu News Photo Gallery Know The Beauty Benefits Of Having Drumstick Leaves Pack For Hair And Skin
Beauty Care: మునగాకుతో మూడింతల అందం…అస్సలు మిస్ కావొద్దు..!
మునగాకు వల్ల పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. అయితే, మునగాకుతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చని తెలిస్తే ఎగిరి గంతేస్తారు. మన చర్మాన్ని, జుట్టును సంరక్షించే గుణాలు మునగాకులో పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మునగాకు పొడి, మునగాకు నూనె.. మన సౌందర్య సంరక్షణలో ఎలా సహాయపడతాయో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Dec 08, 2024 | 3:52 PM

ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మునగ ఆకులలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది. విటమిన్ సి ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే తెల్ల రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. జలుబు, దగ్గు , ఫ్లూ వంటి సాధారణ అనారోగ్యాలను నివారించడంలో పనిచేస్తుంది.

మునగాకు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. మన చర్మాన్ని, జుట్టును సంరక్షించే గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మునగాకు పొడి, మునగాకు నూనె.. మన సౌందర్య సంరక్షణలో అనేక విధాలుగా మేలు చేస్తుంది.

రోజు ఉదయాన్నే ఒక గ్లాసు మునగ ఆకుల నీటిని తాగుతూ ఉంటే రోజంతా అవసరమైన శక్తిని పొందవచ్చు. మునగ నీరు ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు చాలా మంచిది. ఈ నీటిలో ఉండే విటమిన్లు ఆక్సీకరణ, యాంటీఆక్సిడెంట్ ఒత్తిడిని తగ్గిస్తాయి. చర్మాన్ని మృదువుగా, జుట్టును బలంగా చేస్తాయి.

మునగాకు మాత్రమే కాదు.. మునగ కాయ గింజల్లో విటమిన్- ఎ, సి, ఇ లు మెండుగా ఉంటాయి. ఇవి చర్మానికి కావల్సిన తేమను అందించి మృదువుగా చేస్తాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీరాడికల్స్‌తో పోరాడేలా చేసి వృద్ధాప్యఛాయలను తగ్గిస్తాయి.

జుట్టును తేమగా ఉంచే అమైనో ఆమ్లాలు, ఒలియాక్ ఆమ్లాలు మునగాకులో సమృద్ధిగా ఉన్నాయి. ఇవి నిస్తేజమైన కురులను పునర్జీవింప చేయడంలో సాయపడతాయి. తేమను కోల్పోకుండా చేస్తాయి.




