EMRS funding hike: గిరిజన విద్యార్థులకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూక్.. EMRS నిధులు భారీగా పెంపు!
పశ్చిమ బెంగాల్‌లోని గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే బెంగాల్‌లోని గిరిజన ప్రాంతాలు, ప్రత్యేకించి బలహీన గిరిజన సమూహాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ నెస్ట్స్‌తో బెంగాల్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే పలు ఇతర పథకాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయం తీసుకుంది.

పశ్చిమ బెంగాల్‌లోని గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం ఢిల్లీలో బెంగాల్ గిరిజన శాఖ, ఇతర మంత్రులతో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రంజనా చోప్రా కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, నిధుల వినియోగం, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా గిరిజన విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) పథకాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘నెస్ట్స్’ (NESTS), పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం, ఈఎంఆర్‌ఎస్ పాఠశాలల్లో విద్యార్థి ఒక్కంటికి ఇచ్చే వార్షిక నిధులను రూ. 61,500 నుండి ఏకంగా రూ. 1.47 లక్షలకు పెరగనున్నాయి. దీని ద్వారా విద్యార్థులకు ఎన్‌సీఈఆర్‌టీ (NCERT), సీబీఎస్‌ఈ (CBSE) నిబంధనలకు అనుగుణంగా నాణ్యమైన ఆధునిక విద్యతో పాటు సమగ్ర అభివృద్ధికి అవసరమైన వసతులు సమకూరనున్నాయి. అలాగే, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పాఠశాల మౌలిక సదుపాయాలను వేగంగా పూర్తి చేయాలని, ఉపాధ్యాయుల నియామకాలను కేంద్రీకృత ప్రక్రియ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు.
‘పీఎం జన్మన్’, ‘డీఏ-జేజీయూఏ’ లపై ప్రత్యేక దృష్టి
అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ధరతీ ఆబా జన్జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ (DA-JGUA) పరిధిలోకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పూర్తిగా తీసుకురావాలని నిర్ణయించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథాకల ప్రయోజనాలు అందేలా చర్యలు చేపట్టాలని.. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
PVTG గృహ సర్వే ప్రారంభం
అలాగే గిరిజన సంక్షేమ ఫలాలు నేరుగా లబ్ధిదారులకు చేరాలనే లక్ష్యంలో పీవీటీజీ గృహ సర్వే ప్రారంభించామని.. నిర్ణీత గడువులోగా ఈ సర్వే పూర్తి చేస్తామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే రిజన గ్రామాల్లో ఆది సేవా కేంద్రాల ఏర్పాటును వేగవంతం చేయాలని, స్థానిక కమ్యూనిటీ భాగస్వామ్యంతో ప్రతి కేంద్రంలో 5 నుండి 7 మంది వాలంటీర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. అధికారుల కోసం త్వరలోనే ‘ఆది కర్మయోగి అభియాన్’ పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
